Begin typing your search above and press return to search.

బ్లాక్ అండ్ వైట్ లో బుట్టబొమ్మ.. వ్వాటే బ్యూటీ!

గ్లామర్ తో పాటు స్టైల్, స్ట్రాంగ్ ఆటిట్యూడ్ మిక్స్ అయిన ఈ అవుట్ ఫిట్ లో పూజా ఎంతో అందంగా కనిపిస్తోంది.

By:  Tupaki Desk   |   30 Jan 2025 4:45 PM GMT
బ్లాక్ అండ్ వైట్ లో బుట్టబొమ్మ.. వ్వాటే బ్యూటీ!
X

స్టార్ హీరోయిన్ విభిన్నమైన సినిమాలలో నటించిన పూజా హెగ్డే ఫ్యాషన్, గ్లామర్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఇటీవలి కాలంలో ఆమె చేస్తున్న ఫోటోషూట్లు మరింతగా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆమె బ్లాక్ అండ్ వైట్ ఫార్మల్ లుక్‌లో మెరిసిపోతూ ఓ స్టన్నింగ్ ఫోటోషూట్ చేసింది. గ్లామర్ తో పాటు స్టైల్, స్ట్రాంగ్ ఆటిట్యూడ్ మిక్స్ అయిన ఈ అవుట్ ఫిట్ లో పూజా ఎంతో అందంగా కనిపిస్తోంది.


ఆమె నచ్చిన లుక్స్‌తో ఎప్పుడు స్టైల్ ఐకాన్‌గా నిలుస్తూ, అభిమానులను మెస్మరైజ్ చేస్తోంది. ఈ లుక్‌లో పూజా హెగ్డే తెల్లటి షర్ట్, బ్లాక్ టై, షార్ట్ స్కర్ట్, స్టైలిష్ జాకెట్‌తో క్లాసీ లుక్స్ ఇచ్చింది. కళ్లజోడు, హై ఫ్యాషన్ ఫుట్ వేర్ తో మరింత మోడ్ పెంచింది. స్ట్రాంగ్ పోజెస్, స్టన్నింగ్ బాడీ లాంగ్వేజ్ ఆమె స్టైల్ స్టేట్మెంట్ ని హైలైట్ చేస్తున్నాయి. మోడ్రన్ ట్రెండ్స్ ని ఫాలో అవుతూ, బోల్డ్ లుక్స్ తో ఆకట్టుకోవడంలో పూజా హెగ్డేకి సాటి ఎవరు లేరనే చెప్పాలి.


ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ ఫోటోలు క్షణాల్లోనే వైరల్ అవుతుండగా, అభిమానులు ఆమె లుక్స్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. "బ్లాక్ అండ్ వైట్ లో ఈ లుక్ ఏ రేంజ్‌లో ఉందో చెప్పలేం" అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. "సింప్లిసిటీతో స్టన్నింగ్ లుక్" అని ఆమె స్టైల్‌ను మెచ్చుకుంటున్నారు. ప్రతి ఫోటోలోనూ ఆమె అందాన్ని హైలెట్ చేస్తూ, తన గ్లామర్‌తో మ్యాజిక్ క్రియేట్ చేస్తోంది.


ఫ్యాషన్, ట్రెండ్ మిక్స్ చేస్తూ పూజా హెగ్డే ఈసారి ఫార్మల్ స్టైల్‌లో అద్భుతంగా ఆకట్టుకుంది. మామూలు ఫార్మల్ లుక్‌ని స్టైల్ ఐకాన్ లా మార్చేసిన విధానం ఆమె స్టైల్ సెన్స్‌కు నిదర్శనం. సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాదు, ఫ్యాషన్ వరల్డ్‌లో కూడా పూజా ఒక స్పెషల్ బ్రాండ్ అనిపించుకుంటోంది. పూజా ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. టాలీవుడ్ లో మరిన్ని భారీ సినిమాలు చేసే అవకాశాలు ఆమెకు లైన్ లో ఉన్నాయి. అలాగే విజయ్ 69 సినిమాలో కూడా మేయిన్ హీరోయిన్ గా నటిస్తోంది.