12 ఏళ్ల కెరీర్‌లో పూజా హెగ్డే సంపాదన?
బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ లాంటి అగ్ర హీరోల సరసన పూజా అవకాశాల్ని అందుకుంది.
By: Tupaki Desk | 3 Feb 2025 7:19 AM GMTభారతదేశంలోని ప్రామిస్సింగ్ కథానాయికల్లో పూజా హెగ్డే ఒకరు. తెలుగు, తమిళం, హిందీలో అగ్రహీరోల సరసన నటించిన పూజా, కెరీర్ లో పలు బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంది. నేటితరంలో భారీ ఫాలోయింగ్, ప్రజాదరణ ఉన్న నటిగా గుర్తింపు తెచ్చుకుంది. దశాబ్ధం పైగానే తన కెరీర్‌ని విజయవంతంగా కొనసాగిస్తోంది. 2012లో తమిళ చిత్రం `ముగమూడి`తో పూజా హెగ్డే తెరంగేట్రం చేసింది. ఈ చిత్రంలో జీవా కథానాయకుడిగా నటించాడు. 2016 చిత్రం మొహెంజో దారోతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టే ముందు దక్షిణాదిలో అత్యంత డిమాండ్ ఉన్న కథానాయికలలో ఒకరిగా పూజా పేరు మార్మోగింది. తెలుగులో వరుణ్ తేజ్ సరసన `ముకుంద` చిత్రంతో కథానాయికగా ఆరంగేట్రం చేసిన పూజా బ్యాక్ టు బ్యాక్ అక్కినేని హీరోల సినిమాల్లో నటించింది. ఆ తర్వాత వరుసగా చరణ్, ఎన్టీఆర్, బన్ని, ప్రభాస్, మహేష్, దళపతి విజయ్ వంటి అగ్ర హీరోల సరసన అవకాశాల్ని అందుకుంది. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ లాంటి అగ్ర హీరోల సరసన పూజా అవకాశాల్ని అందుకుంది.
అయితే తన కెరీర్ లో పూజా నికర ఆస్తుల ఆర్జన ఎలా ఉంది? అన్న వివరాల్లోకి వెళితే షాకిచ్చే విషయాలు తెలిసాయి. పూజా ఒక్కో సినిమాకి రూ.3.5 -4.5 కోట్ల రేంజులో పారితోషికాలు అందుకుంటోంది. కమర్షియల్ ప్రకటనలతోను భారీగా ఆర్జిస్తోంది. పూజా తన సంపాదనను రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులుగా పెడుతోంది. పూజా ఇప్పటికే ముంబైలోని బాంద్రా ప్రాంతంలో 3బీహెచ్‌కే సీఫేసింగ్ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసింది. లైఫ్‌స్టైల్ ఆసియా కథనం ప్రకారం.. ఈ ఇంటి విలువ 6 కోట్లు. అలాగే హైదరాబాద్‌లో 4 కోట్ల విలువైన ఇల్లు ఉంది. ఈటైమ్స్ కథనం ప్రకారం.. ముంబైలో 45 కోట్ల విలువైన మరో 4000 చదరపు అడుగుల ఇంటిని కూడా పూజా హెగ్డే కొనుగోలు చేసింది.
ఖరీదైన లగ్జరీ కార్లు పూజా సొంతం. పూజా దగ్గర 60 లక్షల విలువైన జాగ్వార్ కార్ ఉంది. అలాగే 2 కోట్ల విలువైన పోర్స్చే కయెన్ కారు, 80 లక్షల విలువైన ఆడి క్యూ7 కార్ కూడా ఉన్నాయి. 2023లో 4 కోట్ల విలువైన రేంజ్ రోవర్ కారును కొనుగోలు చేసింది. అలాగే బ్రాండెడ్ బ్యాగులు, పర్సులు అంటే పూజాకు విపరీతమైన ఆసక్తి ఉంది. 1.4 లక్షల విలువైన ఎల్వి క్రోయిసెట్ హ్యాండ్‌బ్యాగ్ ని రెగ్యులర్ గా ధరిస్తుంది. 1.3 లక్షల విలువైన క్రిస్టియన్ డియోర్ హ్యాండ్‌బ్యాగ్,1.91 లక్షల విలువైన లూయిస్ విట్టన్ బ్యాగ్ ని కొనుగోలు చేసింది.
పూజా హెగ్డే నికర ఆస్తుల విలువను పరిశీలిస్తే... ఈ బ్యూటీ ప్రధానంగా సినిమాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లతో భారీగా ఆర్జిస్తోంది. కొన్ని స్పెషల్ ఈవెంట్లతోను పూజా సంపాదిస్తోంది. దళపతి విజయ్ సరసన ఆమె 2022 చిత్రం బీస్ట్ విజయం సాధించాక తన పారితోషికాన్ని 14 శాతం మేర పెంచిందని కథనాలొచ్చాయి. 3.5 -4 కోట్ల మధ్య ప్రస్తుతం వసూలు చేస్తోందని కథనాలొచ్చాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో 27.5 మిలియన్ల మంది ఫాలోవర్లతో బ్రాండ్ పబ్లిసిటీఆలోను పూజా దూసుకుపోతోంది. ఒక్కో బ్రాండ్ ఎండార్స్‌మెంట్ కోసం దాదాపు 40 లక్షలు వసూలు చేస్తుందని సమాచారం.
పూజా హెగ్డే నెలవారీ ఆదాయం దాదాపు 50 లక్షల వరకూ ఉంటుందని కథనాలొస్తున్నాయి. ప్రస్తుతం పూజా నికర ఆస్తుల విలువ 50 కోట్లు. ఇదంతా స్వీయ ఆర్జన ద్వారా దక్కినది. అలాగే పూజా డాక్టర్లు, లాయర్ల కుటుంబం నుంచి నటనా రంగంలో ప్రవేశించిన సంగతి తెలిసిందే. తాను నటి అవుతానని అనుకోలేదు. కానీ అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అగ్ర కథానాయికగా ఎదిగింది. ఇటీవల బ్యాక్ టు బ్యాక్ దళపతి విజయ్ సరసన అవకాశాలు అందుకుంటోంది. ఒక్కో సినిమాకి 4 కోట్లు తగ్గకుండా పారితోషికం అందుకుంటోంది.