మిస్టేక్ లేకుండా ముందుగానే అలెర్ట్!
ఓటీటీ వెబ్ సిరీస్ లకు ఉన్న డిమాండ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ ఇప్పటికే ఓటీటీ కంటెంట్ కి దాసోహమైంది.
By: Tupaki Desk | 23 Feb 2025 9:30 PM GMTఓటీటీ వెబ్ సిరీస్ లకు ఉన్న డిమాండ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ ఇప్పటికే ఓటీటీ కంటెంట్ కి దాసోహమైంది. ఇమేజ్ తో పనిలేకుండా అంతా ఓటీటీ వరల్డ్ కి ఎంటర్ అవుతున్నారు. టాలీవుడ్ లో ఈ విషయాన్ని విక్టరీ వెంకటేష్ , రానాలు ముందుగానే పసిగట్టారు కాబట్టే ఇప్పటికే లాంచ్ అయ్యారు.
సీనియర్ భామల నుంచి జూనియర్ భామల వరకూ అంతా ఓటీటీ వెబ్ సిరీస్ లకు ఇస్తోన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. సరైన స్క్రిప్ట్ దొరికిందంటే వదిలి పెట్టకుండా ఎంటర్ అవుతున్నారు. తాజాగా ముంబై బ్యూటీ పూజాహెగ్డే కూడా ఓటీటీ తెరంగేట్రానికి రెడీ అవుతోంది. `డీమోంటే కాలనీ`, `కోబ్రా` చిత్రాలతో దర్శకుడిగా ఫేమస్ అయిన అజయ్ జ్ఞానముత్తు నెట్ ఫ్లిక్స్ వేదికగా ఓ వెబ్ సిరీస్ కి రంగం సిద్దం చేస్తున్నాడు.
ఈ వెబ్ సిరీస్ కి పూజాహెగ్డే సైన్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం పూజాహెగ్డే చెన్నైలోనే ఉంటుంది. ఈ మధ్య కాలంలో అమ్మడు ఎక్కువగా తమిళ సినిమాలే కమిట్ అవుతుంది. సూర్య తో చిత్రం...విజయ్ తో `జన నాయగన్` చేస్తుంది. అలాగే `కాంచన 4` లోనూ ఎంపికైంది. `కూలీ`లో ఐటం పాటలోనూ నటిస్తోంది. ఈ నేపథ్యంలోనే మరో ఆలోచన లేకుండా కోలీవుడ్ వెబ్ సిరీస్ కి రెడీ అయింది. అమ్మడు సరైన టైమ్ లో సరైన నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే పూజాహెగ్గేకి టాలీవుడ్ లో అవకాశాలు రాలేదు. టాలీవుడ్ ని కాదని బాలీవుడ్ కి వెళ్లడంతో అమ్మడికి చెక్ పెట్టారు. ఈ క్రమంలో కోలీవుడ్లో ప్రయత్నాలు చేయడంతో లక్కీగా ఛాన్సులొచ్చాయి. ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్నా? అక్కడా సరైన ఫలితాలు రావడం లేదు. ఇలా కొనసాగితే అవకాశాలు ఇంకా జఠిలమవుతాయి. ఈ విషయాన్ని అమ్మడు ముందుగానే పసిగట్టి ఇలా వెబ్ సిరీస్ లకు ముస్తాబవుతోంది.