బుట్ట బొమ్మకి సూపర్ హీరో స్టోరీ!
ఎప్పటి కప్పుడు కొత్త అప్ డేట్స్ ను అందిస్తుంది. అయితే పూజా హెగ్డే చిత్ర పరిశ్రమకొచ్చి దశాబ్దం పూర్తయింది.
By: Tupaki Desk | 6 Feb 2025 3:30 PM GMTముంబై బ్యూటీ పూజాహెగ్డే మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యే పనిలో ఉన్న సంగతి తెలిసిందే. సౌత్ లో ఇప్పుడిప్పుడే అవకాశాలతో బిజీ అవుతోంది. కోలీవుడ్ , టాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటోంది. ప్రస్తుతం సూర్యతో 'రెట్రో', విజయ్ 69వ చిత్రం 'జన నాయగన్', 'కాంచన-4'లో నటిస్తోంది. దీంతో సోషల్ మీడియాలోనూ యాక్టివ్ అయింది. ఎప్పటి కప్పుడు కొత్త అప్ డేట్స్ ను అందిస్తుంది. అయితే పూజా హెగ్డే చిత్ర పరిశ్రమకొచ్చి దశాబ్దం పూర్తయింది.
ఈ సందర్భంగా అమ్మడు ఇంత కాలం మనసులో దాచేసుకున్న కొన్ని కోరికలను పంచుకుంది. 'ఇన్నేళ్ల ప్రయాణంలో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించాను. డిఫరెంట్ జానర్ చిత్రాలు చేసాను. కానీ నేను ఇష్టపడిన చేయాల్సిన కొన్ని పాత్రలు సినిమాలు ఇంకా అలాగే ఉన్నాయి. పూర్తి స్థాయిలో సాగే యాక్షన్ సినిమాల్లో నటించాలంది. అలాగే తండ్రీకూతుళ్ల అనుబంధంతో కూడిన కథల్లోలనూ నటించాలని ఉందని' తెలిపింది.
ఇంకా 'హ్యారీ పోటర్' లాంటి చిత్రాల్లోనూ నటించాలి. నటిగా అలాంటి చిత్రాలు మరింత కిక్ ని ఇస్తాయి. వైవిథ్యమైన పాత్రలు పోషించినప్పుడు నలుగురిలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. రెగ్యులర్ పాత్రలతో అది సాధ్యం కాదు. మరీ ముఖ్యంగా సూపర్ హీరో పాత్రలు పోషించాలి. నా కెరీర్ లో అతి ముఖ్యమైన కోరిక ఇది. మరింత శక్తివంతమైన పాత్రలు పోషించినప్పుడు నటిగా నా సామర్ధ్యం ఏంటి? అన్నది తెలుస్తుందని తెలిపింది.
మొత్తానికి అమ్మడు కెరీర్ ముగిసేలోపు ఈ తరహా పాత్రలన్నీ పోషించాలని భావిస్తుందన్నది తేట తెల్లమైంది.
మరి చిత్ర పరిశ్రమలో అలాంటి అవకాశాలు అందుకుంటుందా? లేదా? అన్నది ఆమె ప్రతిభపై ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే ఓ విషయంలో ట్యాలెంటెడ్ బ్యూటీగా ప్రూవ్ చేసింది. నటిగా సక్సెస్ అయింది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్లిన క్రమంలో హిందీలో అవకాశాలు రాకపోవడంతో? అక్కడ పెద్దగా సమయం వృద్దా చేయకుండా తెలివిగా సౌత్ లో మళ్లీ ఛాన్స్ లందుకుని కంబ్యాక్ అవుతుంది. సాధారణంగా ఇలా వెళ్లి వెనక్కి రావడం అన్నది దాదాపు అసాధ్యం. అలా ప్రయత్నించిన వారు చాలా మంది ఫెయిలయ్యారు. అందులో మాత్రం బుట్టబొమ్మ సక్సెస్ అయింది.