టంగ్ స్లిప్ అయి ఇలా కవర్ చేస్తోందా?
ముంబై బ్యూటీ పూజాహెగ్డే తెలుగు సినిమా `అల వైకుంఠపురములో` చిత్రాన్ని తమిళ చిత్రంగా వ్యాఖ్యానించి ట్రోలింగ్ గురైన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 7 Feb 2025 8:09 AM GMTముంబై బ్యూటీ పూజాహెగ్డే తెలుగు సినిమా `అల వైకుంఠపురములో` చిత్రాన్ని తమిళ చిత్రంగా వ్యాఖ్యానించి ట్రోలింగ్ గురైన సంగతి తెలిసిందే. తను నటించిన సినిమా గురించి తనకే పూర్తిగా తెలియడం లేదు? ఇన్ని సిని మాలు ఎలా చేస్తుంది? అంటూ నెట్టింట ఎటాకింగ్ మొదలైంది. మరి అమ్మడు పోరపాటున అలా మాట్లాడిందా? లేక నిజంగానే తమిళ చిత్రం అనుకుని టంగ్ స్లిప్ అయిందా? అన్నది తెలియదు గానీ ఇలా దొరికితే మాత్రం సోషల్ మీడియాలో ట్రోలింగ్ తీవ్ర రూపం దాల్చుతుంది.
ఈ నేపథ్యంలో తాజాగా పూజాహెగ్డే లైన్లో కి వచ్చి సవరించే ప్రయత్నం చేసింది. ఇప్పటి వరకూ తాను నటించిన సినిమాలన్నింటి విషయంలో ఎంతో గర్వపడుతున్నానని తెలిపింది. కానీ సూర్యతో నటిస్తోన్న `రెట్రో` విషయంలో మాత్రం పరింత ప్రౌడ్ గా ఫీలవుతున్నట్లు వెల్లడించింది. ఆసినిమాలో పాత్రని ఎంతో లవ్ చేసి నటించినట్లు తెలిపింది. సినిమాలో ప్రతీ సన్నివేశానికి కనెక్ట్ అయ్యాను. మేకింగ్ ఎంతో అద్భుతంగా ఉంది.
సెట్ లో టీమ్ ఫుల్ ఎనర్జీతో పని చేసింది. `నా పాత్రను ఎంతో ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు అనిపిస్తుంది. ఇంకా సినిమా ఎడిటింగ్ వెర్షన్ చూడకుండానే చాలా కాన్పిడెంట్ గా ఉన్నాను. ఫైనల్ వెర్షన్ చేస్తే నా నోట మాటలు రావేమో అనిపిస్తుంది. `రాధేశ్యామ్` లో నా ఎమోషనల్ పెర్పార్మెన్స్ నచ్చి కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాలో అవకాశం ఇచ్చా రంది. ఇటీవలే `రెట్రో` షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
ఇదొక గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ స్టోరీ. కోపాన్ని వదిలి ప్రేమను గెలిచిన హీరోగా సూర్యని చూపించబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో సినిమాకి మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమాపై సూర్య చాలా హోప్ తో ఉన్నాడు. సక్సెస్ కూడా అంతే అవసరం. గత సినిమా కంగువ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా దెబ్బతింది. దీంతో రెట్రో తో బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు. మే 1న చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.