కంబ్యాక్ లో బుట్టబొమ్మ మనసు గెలిచిన చిత్రం!
టాలీవుడ్ ని కాదని బాలీవుడ్ కి వెళ్లిన పూజాహేగ్డే అలియాస్ బుట్టబొమ్మ ఎంత వేగంగా వెళ్లిందో అంతే వేగంగా మళ్లీ పెవీలియన్ చేరిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 11 Dec 2024 10:30 AM GMTటాలీవుడ్ ని కాదని బాలీవుడ్ కి వెళ్లిన పూజాహేగ్డే అలియాస్ బుట్టబొమ్మ ఎంత వేగంగా వెళ్లిందో అంతే వేగంగా మళ్లీ పెవీలియన్ చేరిన సంగతి తెలిసిందే. లక్కీగా అమ్మడు అక్కడ ఎక్కువ సమయం వృద్ధా చేయకుండా సౌత్ ఇండస్ట్రీకి తిరిగి వచ్చింది. సాధారణంగా ఇలా వెళ్లి వచ్చిన వారికి తిరిగి అవకాశాలు ఇవ్వడం అన్నది అంత వీజీ కాదు. ఎంతో అదృష్టం ఉంటే తప్ప సాధ్యం కాదు. ఆవిషయంలో బుట్టబొమ్మ లక్కీ గాళ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.
కంబ్యాక్ లో స్టార్ హీరోలతోనే అవకాశాలు అందుకుంటుంది. తెలుగులో నాగచైతన్యతో ఓ సినిమాకి సైన్ చేసింది. కోలీవుడ్ లో సూర్య 44వ చిత్రంలోనూ ఈ అమ్మడే హీరోయిన్. దళపతి విజయ్ 69వ చిత్రంలో సైతం పూజానే హీరోయిన్. ఇవి చేతిలో అధికారికంగా ఉన్న ప్రాజెక్ట్ లు. అనధికారంగా ఇంకా మూడు నాలుగు సినిమాలకు కమిట్ అయినట్లు సమాచారం. అమ్మడు మాలీవుడ్ కి కూడా ఎంట్రీ ఇస్తుంది.
అయితే వీటన్నింటిలో కల్లా బుట్టబొమ్మ మనసుకు దగ్గరైన రోల్ ఏది అంటే సూర్య 44వ చిత్రం అంటోంది. ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి విషయాలు పంచుకుంది. `ప్రేమ, యుద్దం, నవ్వు చుట్టూ తిరిగే కథ ఇది. ఈ మూడు అంశాల్ని ఆధారంగా చేసుకుని ఇంత వరకూ సినిమా రాలేదు. ఈ కథకు నా పాత్ర వెన్నుముఖ. ఇంత ప్రాధాన్యత ఉన్న దక్కడం నిజంగా అదృష్టం అనే చెప్పాలి` అని తెలిపింది.
సూర్య 44వ చిత్రాన్ని కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. దర్శకుడిగా కార్తీక్ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. రొటీన్ కి భిన్నమైన సినిమాలు తెరకెక్కించడంలో ఆయన స్పెషలిస్ట్. ఇప్పటివరకూ ఆయన తెరకెక్కించిన చాలా చిత్రాలు విజయాలు అందుకున్నవే. అలాంటి డైరెక్టర్ కి సూర్య లాంటి స్టార్ తోడవ్వడంతో 44పై అంచనాలు పీక్స్ కి చేరుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడ పూర్తయింది.