ఈ టైమ్‌లో పూజాకి అంతనా..?
ఆమె పారితోషికం మరీ టూమచ్‌గా డిమాండ్ చేయడంతో చేసేది లేక శ్రీలీలతో కిస్సిక్ సాంగ్ చేయించారు.
By: Tupaki Desk | 28 Feb 2025 11:12 AM ISTప్రస్తుతం సౌత్ ఇండియన్ కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్ సినిమాలకు ఐటెం సాంగ్ తప్పనిసరిగా మారింది. పెద్ద హీరోల సినిమాల్లో ఐటెం సాంగ్స్‌కి ప్రత్యేక స్థానంను కల్పిస్తున్నారు. హీరోయిన్స్ ఎంపిక విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటారో అంతకు మించి ఐటెం సాంగ్ హీరోయిన్ ఎంపిక విషయంలోనూ అంతకు మించి జాగ్రత్తలు తీసుకోవడం మనం చూస్తున్నాం. పుష్ప 2 సినిమా కోసం బాలీవుడ్ హీరోయిన్‌ను ఎంపిక చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు. ఆమె పారితోషికం మరీ టూమచ్‌గా డిమాండ్ చేయడంతో చేసేది లేక శ్రీలీలతో కిస్సిక్ సాంగ్ చేయించారు. శ్రీలీల చేసిన కిస్సిక్ సినిమాకు మంచి స్పందన వచ్చిన విషయం తెల్సిందే.

పుష్ప 2 సినిమాలో కిస్సిక్ ఐటెం సాంగ్‌ను చేసినందుకు గాను శ్రీలీల ఏకంగా రూ.2 కోట్ల పారితోషికం అందుకుంది అనే వార్తలు వచ్చాయి. జాతీయ మీడియాలోనూ శ్రీలీల పారితోషికం గురించి ప్రముఖంగా చర్చ జరిగింది. ఐటెం సాంగ్స్‌కి భారీ ఎత్తున ఖర్చు చేస్తున్న మేకర్స్ అందులో నటించిన హీరోయిన్స్‌కి సైతం భారీ పారితోషికం ఇవ్వాల్సి వస్తుంది. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమాలో ఐటెం సాంగ్‌ను పూజా హెగ్డే చేసేందుకు కమిట్ అయింది. నిన్నటి నుంచి ఐటెం సాంగ్ చిత్రీకరణ సైతం ప్రారంభం అయిందని సమాచారం అందుతోంది. ఆ భారీ చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్నందుకు గాను పూజా హెగ్డే భారీ పారితోషికం అందుకుంటుందని సమాచారం.
కోలీవుడ్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం 'కూలీ' సినిమాలో పూజా హెగ్డే ఐటెం సాంగ్ చేసినందుకు గాను నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఏకంగా రూ.2 కోట్ల పారితోషికం ఇస్తుందట. ఆ రెండు కోట్లు మాత్రమే కాకుండా ఆమెకు ట్రావెల్ ఖర్చులు, స్టాఫ్ ఖర్చు, ఇతర ఖర్చులు మరో రూ.10 లక్షలు అవుతున్నాయట. మొత్తంగా పూజా హెగ్డేను కూలీ ఐటెం సాంగ్‌లో నటింపజేసినందుకు గాను ప్రొడక్షన్ హౌస్ ఏకంగా రూ.2.1 కోట్లను ఖర్చు చేస్తుందని సమాచారం అందుతోంది. రజనీకాంత్ వంటి సూపర్ స్టార్ సినిమాలో నటిస్తున్న పూజా హెగ్డేకు ఆ స్థాయి పారితోషికం ఇవ్వడం సబబే అనే అభిప్రాయంను పలువురు వ్యక్తం చేస్తున్నారు.
ఈ మధ్య కాలంలో పూజా హెగ్డే టైం బాగాలేదు. ఈమె ఒకప్పుడు టాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేసినప్పటికీ ఇప్పుడు పరిస్థితులు బాగాలేవు. ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డాయి. దాంతో టాలీవుడ్‌లో గత రెండు మూడు ఏళ్లుగా కొత్త సినిమాలు ఏమీ లేవు. గత ఏడాది ఈమె నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. ఈ ఏడాదిలో కోలీవుడ్‌లో ఈ అమ్మడికి కాస్త మంచి ఆఫర్లు వస్తున్నాయి. కనుక కోలీవుడ్‌లో ఈ అమ్మడికి రాబోయే రోజుల్లో మరిన్ని మంచి ఆఫర్లు దక్కే అవకాశాలు ఉన్నాయి. కూలీ ఐటెం సాంగ్ హిట్ అయితే కచ్చితంగా మంచి ఆఫర్లు వస్తాయనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇదే సమయంలో పూజా హెగ్డేకి అంత పారితోషికం అవసరమా అని ప్రశ్నిస్తున్న వారు చాలా మంది ఉన్నారు.