Begin typing your search above and press return to search.

వైట్ సారీలో బుట్ట‌బొమ్మ గుబులు పుట్టంచేలా!

డిజైన‌ర్ దుస్తులైనా...సంప్ర‌దాయ వ‌స్త్రాలైనా బుట్ట బొమ్మ ధ‌రించిందంటే ఆ దుస్తుల‌కే వ‌న్నె వ‌చ్చేస్తుంది.

By:  Tupaki Desk   |   7 Oct 2024 5:18 AM GMT
వైట్ సారీలో బుట్ట‌బొమ్మ గుబులు పుట్టంచేలా!
X

ఫ్యాష‌న్ వ‌ర‌ల్డ్ లో ముంబై బ్యూటీ పూజాహెగ్డే ఓ స్పెష‌లిస్ట్ అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. అమ్మ‌డి ఎంపిక‌లు అమెలో బ్యూటీని అంత‌కంత‌కు హైలైట్ చేస్తుంటాయి. క‌టౌట్ కి త‌గ్గ‌ట్టు కంటెంట్ ఉంటుంది. సొగ‌స‌రి ఎంపిక చేసుకునే దుస్తులే అందాన్ని రెట్టింపు చేస్తుంటాయి. హైట్..వెయిట్ కి త‌గ్గ‌ట్టు అలంక‌ర‌ణ‌ విషయంలో ఎంతో శ్ర‌ద్ద తీసుకుంటుంది. డిజైన‌ర్ దుస్తులైనా...సంప్ర‌దాయ వ‌స్త్రాలైనా బుట్ట బొమ్మ ధ‌రించిందంటే ఆ దుస్తుల‌కే వ‌న్నె వ‌చ్చేస్తుంది.


తాజాగా సొగ‌స‌రి చీరందంలో త‌ళుకులీనింది. ఇదిగో ఇక్క‌డిలో తెలుపు చీర‌..ర‌విక‌లో అగ్గిరాజేస్తుంది. పూజ స్కిన్ టోన్ ని తెలుపు అందం ప‌ర్పెక్ట్ గా మ్యాచ్ చేసింది. సాధార‌ణ తెలుపు వ‌ర్ణం ప‌లుచ‌ని చీర‌పై పొడి డిజైన్ తో కూడిన బ్లౌజు ఎంపిక చేసుకుంది. సారీ కంటే అమ్మ‌డి స్కిన్ టోన్ సారీని డామినేట్ చేస్తుంది. ఇక అమ్మ‌డు ఎంపిక చేసుకున్న‌యాక్స‌ర‌సీస్ మ‌రింత అందంగా తీర్చిదిద్దాయి.


చెవుల‌కు ఎంపిక చేసుకున్న దిద్దులు మ‌రింత పెద్ద‌విగా పేస్ ని మ్యాచ్ చేస్తున్నాయి. నుదిటిన తెలుపు రంగు స్టిక‌ర్ పెట్టుకుంది. మ్యాక‌ప్ సైతం లైట్ గా వేసుకుంది. పెదాల‌కు పూసిన లిప్ స్టిక్ ప్ర‌తీది చీర‌ని మ్యాచ్ చేస్తూ అలంక‌రించుకున్న‌వే. చీరందంలో అమ్మ‌డు వివిధ భంగిమ‌ల్లో కెమెరాకి ఫోజులిచ్చింది. ఒక్కో పిక్ లో ఒక్కో ప్ర‌త్యేక‌త‌ను హైలైట్ చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.


ఇక పూజా కెరీర సంగ‌తి చూస్తే..టాలీవుడ్ నుంచి ఎంత సాలిడ్ గా వెళ్లిందో? అంతే సాలిడ్ గా అమ్మడు సౌత్ లో కంబ్యాక్ అవుతోన్న విష‌యం తెలిసిందే. యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య స‌ర‌స‌న ఓ కొత్త సినిమాకి ఇటీవ‌లే సంత‌కం చేసింది. అతి త్వ‌ర‌లోనే ఆ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్క‌నుంది. అలాగే కోలీవుడ్ లో సూర్య 44వ చిత్రంలోనూ పూజ అవ‌కాశం అందుకుంది.