వీదేశీ అందాల్నే హీటెక్కిస్తోన్న హాట్ భామలు!
టైమ్ దొరికితే వెకేషన్లకు చెక్కేయడం హీరోయిన్లకు ఓ హాబీ లాంటింది. ఈ విషయంలో భామా మణులు ఎక్కడా తగ్గరు. షూటింగ్ నుంచి ఒక్కసారిగా రిలాక్స్ మోడ్ లో కి జారుకుంటారు.
By: Tupaki Desk | 17 Oct 2024 10:11 AM GMTటైమ్ దొరికితే వెకేషన్లకు చెక్కేయడం హీరోయిన్లకు ఓ హాబీ లాంటింది. ఈ విషయంలో భామా మణులు ఎక్కడా తగ్గరు. షూటింగ్ నుంచి ఒక్కసారిగా రిలాక్స్ మోడ్ లో కి జారుకుంటారు. అందులోనూ బర్త్ డేలు...స్పెషల్ అకేషన్స్ లాంటివి ఏవైనా వచ్చాయంటే? అస్సలు ఆగలేరు. బాలీవుడ్ హీరోయిన్లకు వెకేషన్ స్పాట్ ఏది? అంటే ఠక్కున మాల్దీవులే గుర్తొస్తుంది. అందమైన ఐలాండ్ లో వాలిపోయి వారం-పది రోజులు ఎంజాయ్ చేస్తారు.
అలాగని ప్రపంచంలో మిగతా అందాల్ని ఆస్వాదించరని కాదు. ఇంకాస్త టైమ్ ఎక్కువగా ఉంటే సుదూర ప్రాంతాలకు వెళ్లిపోతుంటారు. ఓసారి విదేశాల్లో ఉన్న ఆ భామలెవరో చూద్దాం. ముంబై బ్యూటీ పూజాహెగ్డే శ్రీలంక అందాల్ని ఆస్వాదిస్తోంది. శ్రీలంక జంగిల్ రిసార్స్ట్ లో బర్త్ డేని సోలోగా ఆస్వాదిస్తోంది. అక్కడే కేక్ కట్ చేసి సెలబ్రేషన్ చేసుకుంది. ఇన్ స్టాలో ఫోటోలు చేసి తానెంత చిల్ అవుతుందో చెప్పకనే చెప్పింది.
ఇక మోహ్రీన్ పిర్జాదా కి నటిగా అవకాశాలు లేకపోవడంతో దేశంలోనే కనిపించలేదు. విదేశాల్లో ఎక్కువగా స్వదేశంలో ఎక్కువగా ఉంటుంది. విదేశాల్లో కొత్త కొత్త ప్రదేశాలు చుట్టేస్తోంది. నెలకో దేశంలో ఉంటోంది. ప్రస్తుతం లండన్ లో ఉంది. అక్కడ నుంచే తన అప్ డేట్స్ అన్నీ ఇస్తోంది. ఆమెతో పాటు మామ్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే యువ నాయిక కావ్యాథాపర్ కూడా రిలాక్స్ మోడ్ లోకి జారుకుంది.
మొన్నటి వరకూ `విశ్వం` సినిమా పనుల్లో ఉన్న అమ్మడు రిలీజ్ అనంతరం బాలి చెక్కేసింది. ప్రస్తుతం ఇండోయేషియా అందాల్లో సేద తీరుతోంది. వచ్చే వారం ఇండియాకి రానుంది. అలాగే అందాల త్రిష కూడా హాలీడే ట్రిప్ లో ఉంది. స్నేహితుల్ని వెంటేసుకుని మొరాకో చెక్కేసింది. అక్కడ ప్రకతి అందాల మధ్య సేద తీరుతోంది. వర్ష బొల్లమ్మా అబుదాబిలో.. కావ్యా కల్యాణ్ రామ్ టర్కీలో ఇంకా కొంత మంది భామలు విదేశీ వెకేషన్ లోనే ఉన్నారు.