Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : బీచ్‌లో బుట్టబొమ్మ అందమైన యోగాసనం

బుట్టబొమ్మ పూజా హెగ్డే ఈ మధ్య కాలంలో సినిమాల్లో ఎక్కువ కనిపించడం లేదు.

By:  Tupaki Desk   |   22 Jun 2024 8:34 AM GMT
పిక్ టాక్ : బీచ్‌లో బుట్టబొమ్మ అందమైన యోగాసనం
X

బుట్టబొమ్మ పూజా హెగ్డే ఈ మధ్య కాలంలో సినిమాల్లో ఎక్కువ కనిపించడం లేదు. కానీ సోషల్‌ మీడియాలో మాత్రం మునుపటి కంటే ఉత్సాహంగా కనిపిస్తుంది. అంతే కాకుండా మునుపటి కంటే కూడా మరింత అందంగా కనిపిస్తుంది. ఈమె అందాల ఆరబోత ఫోటోలకు నెటిజన్స్ తడిసి ముద్ద అవుతున్నారు.


తాజాగా అంతర్జాతీయ యోగ దినోత్సవం జరుపుకున్నాం. అందుకు తగ్గట్లుగా హీరోయిన్స్‌ ఎంతో మంది యోగ ఆసనాలు వేసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్‌ చేసి అంతర్జాతీయ యోగ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేయడం జరిగింది.


అందాల పూజా హెగ్డే కూడా తన యోగ డే స్పెషల్‌ ఫోటోలను షేర్‌ చేసింది. సముద్రపు ఒడ్డున బీచ్ లో పింక్ కలర్‌ సింగిల్ పీస్‌ స్విమ్ సూట్‌ లో యోగ ఆసనం వేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ స్థాయిలో అందంగా ఉన్న పూజా హెగ్డే ను ఇండస్ట్రీ మిస్ అవుతుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.


అందమైన బుట్టిబొమ్మ యోగ ఆసనం మరింత అందంగా ఉందంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే, ఈమె బాడీ మరీ ఇంత ప్లెక్సిబుల్‌ గా ఉంటుందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి బుట్టబొమ్మ అందమైన యోగాసనం ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

ఇక ఈ అమ్మడి సినిమాల విషయానికి వస్తే గత ఏడాది కాలంగా ఈ అమ్మడు చేసిన సినిమాలు పెద్దగా లేవని చెప్పాలి. మహేష్‌ బాబుకు జోడీగా గుంటూరు కారం సినిమాలో ఎంపిక అయ్యి చివరి నిమిషంలో తప్పుకోవాల్సి వచ్చింది.

హిందీలో ఒకటి రెండు సినిమాలు చేసినా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అందుకే ఈ అమ్మడు ఒక భారీ హిట్‌ కోసం వెయిట్‌ చేస్తుంది. తిరిగి పూర్వ వైభవం సాధిస్తానంటూ ధీమా వ్యక్తం చేస్తుందట. మరి ఈ అమ్మడు టాలీవుడ్‌ లో బిజీ అయ్యేనా అంటే ఇలాంటి ఫోటోలు చూసిన సమయంలో అవ్వాలంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.