Begin typing your search above and press return to search.

వ‌రుస ప‌రాజ‌యాల త‌ర్వాత బౌన్స్ బ్యాక్

కొన్ని వ‌రుస ఫ్లాప్‌ల త‌ర్వాత బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే గ్రేట్ కంబ్యాక్ ఇప్పుడు అభిమానుల్లో చర్చ‌నీయాంశంగా మారింది.

By:  Tupaki Desk   |   12 Dec 2023 3:00 AM GMT
వ‌రుస ప‌రాజ‌యాల త‌ర్వాత బౌన్స్ బ్యాక్
X

కొన్ని వ‌రుస ఫ్లాప్‌ల త‌ర్వాత బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే గ్రేట్ కంబ్యాక్ ఇప్పుడు అభిమానుల్లో చర్చ‌నీయాంశంగా మారింది. టాలీవుడ్ అగ్ర క‌థానాయిక‌గా ఓ వెలుగు వెలిగిన ఈ బ్యూటీ కొన్ని వ‌రుస ఫ్లాప్ ల‌తో రేసులో వెన‌క‌బ‌డింద‌ని ప్ర‌చార‌మైంది. ఆఫర్‌ల వెల్లువ మునుప‌టితో పోలిస్తే బాగా త‌గ్గింద‌న్న‌ది వాస్త‌వం. ఇప్ప‌టికిప్పుడు పూజాకు టాలీవుడ్ లో అవ‌కాశాల్లేవ్. కొన్ని ప్రాజెక్టుల‌కు ప‌రిశీలించినా చివ‌రి నిమిషంలో వైదొల‌గ‌డంతో రేసులో వెన‌క‌బ‌డింది. అటు త‌మిళంలోను ఆశించినంత‌గా అవ‌కాశాల్లేవ్. రాదేశ్యామ్ - బీస్ట్ లాంటి ఫ్లాప్ చిత్రాల వ‌ల్ల ఈ ప‌రిస్థితి త‌లెత్తింది.


కానీ పూజా ఏనాడూ కుంగిపోలేదు. త‌న‌దైన శైలిలో ఈ బ్యూటీ నిరంత‌రం మీడియా హెడ్ లైన్స్ లో నిలిచింది. ఇప్ప‌టికిప్పుడు అర‌డ‌జ‌ను ప్రాజెక్టుల్లో న‌టిస్తూ త‌న కంబ్యాక్ ని ఘ‌నంగా చాటుకుంటోంది. నేచుర‌ల్ స్టార్ నానితో సిబి చక్రవర్తి దర్శకత్వంలో ఒక సినిమా కోసం ఎంపికైంది. లక్కీ భాస్కర్ లో దుల్కర్ సల్మాన్ సరసన మరో ముఖ్యమైన ఆఫర్ కోసం త‌న‌ను సంప్రదించినట్లు క‌థ‌నాలొస్తున్నాయి. ఐదు నుండి ఆరు సినిమా అవ‌కాశాలు ఇటీవ‌ల త‌న‌ను వ‌రించాయ‌న్న టాక్ వినిపిస్తోంద‌. అయితే అవ‌కాశాలు త‌న వెంట ఉన్నా కానీ పూజా ఇంకా దేనికీ తేదీల్ని ఖరారు చేయలేదు. అటు హిందీ ప‌రిశ్ర‌మ‌లో తన కమిట్‌మెంట్‌లను దృష్టిలో పెట్టుకుని సౌత్ కి ద్వితీయ ప్రాధాన్య‌త‌నిస్తోంద‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

పూజా హెగ్డే ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌తో మూడు చిత్రాల ఒప్పందాన్ని కలిగి ఉండగా, టాలీవుడ్ లో బలమైన పునరాగమనం చేయగల స‌రైన అవ‌కాశం కోసం వేచి చూస్తోంద‌ని కూడా టాక్ ఉంది. రష్మిక, మృణాల్, శ్రీ‌లీల త‌ర‌హాలోనే తెలుగు ప్రేక్షకులలో పూజా హెగ్డే ఆకర్షణ చెక్కుచెదరలేదు.. కానీ సినిమాల్లో న‌టించ‌డ‌మే త‌గ్గించింది. ఇప్ప‌టికీ ప‌రిశ్ర‌మ అగ్ర హీరోల జాబితాలో పూజా పేరు చెక్కు చెద‌ర‌లేద‌న్న టాక్ కూడా ఉంది.

గతంలో అరవింద సమేత-మహర్షి-అల వైకుంఠపురములో వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో A-స్టార్ జాబితాలో చేరిన పూజా హెగ్డే ప్రస్తుత వైఫ‌ల్యాల‌ను విశ్లేషించి తిరిగి గ్రేట్ కంబ్యాక్ కోసం ప్ర‌య‌త్నిస్తోంది. పోటీలో నిరుత్సాహానికి తావివ్వ‌క మునుముందు విజయవంతమైన పునరాగమనం కోసం వేచి చూస్తోంది. రాధే శ్యామ్, బీస్ట్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ వంటి వరుస ఫ్లాప్‌లతో నిరాశ‌ప‌డిన మాట వాస్త‌వం. మ‌హేష్‌- త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీ `గుంటూరు కారం` నుండి కూడా తప్పుకుంది. పూజా హెగ్డే స్థానంలో మీనాక్షి చౌదరి ఈ చిత్రంలో ఎంపికైంది. పూజా నిష్క్రమణను మేకర్స్ అధికారికంగా ప్రకటించనప్పటికీ దర్శకుడితో పూజాకు క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ త‌లెత్తాయన్న ప్ర‌చారం కూడా ఉంది.

ముఖ్యంగా బాలీవుడ్ లో కిసీ కా భాయ్ కిసీకి జాన్ ప‌రాజ‌యం తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది. పూజా ఎప్పుడూ చూడని భారీ ఫ్లాప్ ఇది. సల్మాన్ ఖాన్‌తో కలిసి పనిచేయడం ఆమె తీసుకున్న చెత్త నిర్ణయాలలో ఒకటి అంటూ విమ‌ర్శ‌లు ఎదుర‌య్యాయి. ఈ అంశాలన్నీ పూజా కెరీర్‌ను గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభావితం చేశాయి. కానీ ఇప్పుడు బాలీవుడ్ స‌హా టాలీవుడ్ లోనే గ్రేట్ కంబ్యాక్ కోసం వేచి చూస్తోంది.