Begin typing your search above and press return to search.

పూజా అప్డేట్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్..!

బుట్ట బొమ్మ పూజా హెగ్దే మొదట్లో సౌత్ నార్త్ అన్ని చోట్ల సినిమాలు చేసినా ఆమెకు మొదటి హిట్ ఇచ్చింది మాత్రం తెలుగు పరిశ్రమే

By:  Tupaki Desk   |   11 Aug 2023 8:12 AM GMT
పూజా అప్డేట్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్..!
X

బుట్ట బొమ్మ పూజా హెగ్దే మొదట్లో సౌత్ నార్త్ అన్ని చోట్ల సినిమాలు చేసినా ఆమెకు మొదటి హిట్ ఇచ్చింది మాత్రం తెలుగు పరిశ్రమే. అల్లు అర్జున్ తో నటించిన దువ్వాడ జగన్నాథం సినిమా పూజా హెగ్దే కెరీర్ లో ఫస్ట్ హిట్ సినిమాగా నిలిచింది. అయితే అప్పటికే టాలీవుడ్ లో హీరోయిన్స్ కొరత బాగా ఉండటం వల్ల అమ్మడికి వరుస సినిమా ఆఫర్లు వచ్చాయి. స్టార్ సినిమాల్లో కావాల్సిన గ్లామర్ ట్రీట్ కూడా అమ్మడు అందించడం వల్ల పూజా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. టాలీవుడ్ లో ఉన్న స్టార్స్ అందరితో నటించిన పూజా హెగ్దే తెలుగులో టాప్ హీరోయిన్ గా పాపులారిటీ సాధించింది.

అయితే అమ్మడు ఇప్పటికీ మంచి ఫాంలో ఉన్నా సరే సడెన్ గా అవకాశాలు లేక ఖాళీ అయిపోయింది. మహేష్ తో గుంటూరు కారం లో మొదట హీరోయిన్ గా పూజా హెగ్దేని అనుకున్నా సరే ఆమె ఇచ్చిన డేట్స్ లో సినిమా షూటింగ్ వాయిదా పడటం ఆ తర్వాత డేట్స్ అడ్జెస్ట్ చేయలేక సినిమా వదులుకోవడం జరిగిందట. అయితే తీసుకున్న అడ్వాన్స్ కి న్యాయం చేయడం కోసం పూజా హెగ్దే గుంటూరు కారం సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి ఓకే చెప్పిందట.

గుంటూరు కారం సరే మిగతా స్టార్స్ ఎందుకు పూజా కు ఛాన్స్ ఇవ్వట్లేదు అన్నది డిస్కషన్స్ లోకి వస్తుంది. అయితే స్టార్స్ అంతా కూడా ప్రస్తుతం వారు చేస్తున్న సినిమాల్లో హీరోయిన్స్ ని ఫిక్స్ చేసుకున్నారు. కమిటైన సినిమాలు పూర్తైతే తమ నెక్స్ట్ సినిమాలో పూజా బేబిని తీసుకునే అవకాశం ఉంది. తెలుగులో ఇప్పటికీ సూపర్ క్రేజ్ ఉన్న పూజా హెగ్దే ఆఫర్ల కోసం ఎదురుచూస్తుంది.

పూజా సినిమా అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అమ్మడు రెండు మూడు సినిమాల డిస్కషన్స్ లో ఉందని తెలుస్తుంది. బుచ్చి బాబు చరణ్ కాంబోలో వస్తున్న సినిమాతో పాటుగా ఎన్.టి.ఆర్ ప్రశాంత్ నీల్ కాంబో సినిమాలో పూజా హెగ్దేని హీరోయిన్ గా తీసుకోవాలని చూస్తున్నారట. ఆ సినిమాలు ఓకే అయితే మాత్రం పూజా రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పటికే సినిమాకు 2 నుంచి 3 కోట్ల దాకా డిమాండ్ చేస్తున్న పూజా పాన్ ఇండియా హిట్లు పడితే మాత్రం ఆ రేటు పెంచే అవకాశం ఉంది.