Begin typing your search above and press return to search.

జెబ్బ‌ల గౌనులో బుట్ట‌బొమ్మ స‌య్యాట‌!

ఇదిగో ఇక్క‌డిలా జెబ్బ‌ల గౌనేసి..క‌ళ్ల‌కు అద్దాలు ధ‌రించి కిల‌కిలా న‌వ్వేసింది. ఓ చేతిని వ‌య్యారంగా చాచి..మ‌రో చేతిలో ఐస్ క్రీమ్ తో ఫోజులిచ్చిందిలా.

By:  Tupaki Desk   |   19 July 2024 4:06 PM GMT
జెబ్బ‌ల గౌనులో బుట్ట‌బొమ్మ స‌య్యాట‌!
X

ఫ్యాష‌న్ వ‌ర‌ల్డ్ లో ముంబై బ్యూటీ పూజాహెగ్డే ఓ స్పెష‌లిస్ట్ అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. అమ్మ‌డి ఎంపిక‌లు అమెలో బ్యూటీని అంత‌కంత‌కు హైలైట్ చేస్తుంటాయి. క‌టౌట్ కి త‌గ్గ‌ట్టు సొగ‌స‌రి ఎంపిక చేసుకునే దుస్తులే అమ్మ‌డి అందాన్ని రెట్టింపు చేస్తుంటాయి. హైట్..వెయిట్ కి త‌గ్గ‌ట్టు క‌ట్టుబొట్టు ప్ర‌తీ విషయంలో ఎంతో శ్ర‌ద్ద తీసుకుంటుంది. డిజైన‌ర్ దుస్తులైనా...సంప్ర‌దాయ వ‌స్త్రాలైనా బుట్ట‌బొమ్మ ధ‌రించిందంటే ఆ దుస్తుల‌కే వ‌న్నె వ‌చ్చేస్తుంది.

తాజాగా పూజాహెగ్డే మ‌రోసారి అందాన్ని రెట్టింపు చేసే జెబ్బ‌ల గౌనులోకి దూరిపోయింది. ఇదిగో ఇక్క‌డిలా జెబ్బ‌ల గౌనేసి..క‌ళ్ల‌కు అద్దాలు ధ‌రించి కిల‌కిలా న‌వ్వేసింది. ఓ చేతిని వ‌య్యారంగా చాచి..మ‌రో చేతిలో ఐస్ క్రీమ్ తో ఫోజులిచ్చిందిలా. అమ్మ‌డు ముస్తాబైన విధానం.. అలంక‌ర‌ణ ప్ర‌తీది బుట్ట‌బొమ్మ‌ని మ‌రింత అందంగా తీర్చి దిద్దాయి. జెబ్బ‌ల గౌను ఎప్పుడేసినా? అమ్మ‌డి కోసమే ఆ డిజైన్ పుట్టిందా? అన్న అందంగా హైలైట్ అవుతుంది.

త‌న‌లో బ్యూటీని బ్యూటీని ప్రొజెక్ట్ చేయ‌డానికి ప‌ర్పెక్ట్ ఔట్ ఫిట్ ఇది. ఈసారి సంథింగ్ స్పెష‌ల్ గా చేతిలో ఐస్ క్రీమ్ తో మురిపించ‌డం విశేషం. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. పూజా అందానికి నెటి జ‌నులంతా ఫిదా అవుతున్నారు. అమ్మ‌డు క్యూట్ ఫోజుకి కుర్రాళ్లంతా వావ్ అనేస్తున్నారు. ముంబై బ్యూటీనా? మ‌జాకానా? మ‌రి!

ఇక పూజా కెరీర సంగ‌తి చూస్తే..టాలీవుడ్ నుంచి ఎంత సాలిడ్ గా వెళ్లిందో? అంతే సాలిడ్ అమ్మడు సౌత్ లో కంబ్యాక్ అవుతోన్న విష‌యం తెలిసిందే. యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య స‌ర‌స‌న ఓ కొత్త సినిమాకి ఇటీవ‌లే సంత‌కం చేసింది. అతి త్వ‌ర‌లోనే ఆ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్క‌నుంది. అలాగే కోలీవుడ్ లో సూర్య 44వ చిత్రంలోనూ పూజ అవ‌కాశం అందుకుంది. ఇలా వ‌రుస‌గా రెండు సినిమాల్లో ఛాన్సులు అందుకోవ‌డం అన్న‌ది చాలా ఈజీగానే జ‌రిగింది.