Begin typing your search above and press return to search.

పిక్‌ టాక్ : గోల్డెన్‌ గ్లిట్టర్ ఔట్‌ ఫిట్‌లో బుట్టబొమ్మ

అల్లు అర్జున్‌ డీజే సినిమా తో టాలీవుడ్‌ లో మొదటి సక్సెస్‌ ను దక్కించుకున్న ముద్దుగుమ్మ పూజా హెగ్డే స్టార్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్ గా మారి వరుసగా భారీ చిత్రాల్లో నటించింది.

By:  Tupaki Desk   |   16 Dec 2023 7:49 AM GMT
పిక్‌ టాక్ : గోల్డెన్‌ గ్లిట్టర్ ఔట్‌ ఫిట్‌లో బుట్టబొమ్మ
X

అల్లు అర్జున్‌ డీజే సినిమా తో టాలీవుడ్‌ లో మొదటి సక్సెస్‌ ను దక్కించుకున్న ముద్దుగుమ్మ పూజా హెగ్డే స్టార్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్ గా మారి వరుసగా భారీ చిత్రాల్లో నటించింది. దాదాపు అందరు స్టార్‌ హీరోలకు జోడీగా నటించిన ముద్దుగుమ్మ పూజా హెగ్డే ఇప్పుడు కాస్త డల్‌ అయ్యింది అనిపిస్తోంది.


సినిమాల పరంగా స్లో అయినా కూడా సోషల్‌ మీడియాలో మాత్రం ఈ అమ్మడి జోరు కంటిన్యూ అవుతోంది. అందాల ఫోటో షూట్స్ ను షేర్ చేయడం ద్వారా బాలీవుడ్‌ ముద్దుగుమ్మలకు ఉన్న స్థాయిలో ఇన్ స్టా లో ఫాలోవర్స్ ను కలిగి ఉంది. తన ఫాలోవర్స్ కోసం తాజాగా మరో అందమైన ఫోటో షూట్ ని షేర్‌ చేసింది.


గోల్డెన్ గ్లిట్టర్ డ్రెస్ లో బుట్ట బొమ్మ పూజా హెగ్డే చూపు తిప్పుకోనివ్వడం లేదు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఈ రేంజ్‌ లో అందంగా ఉన్న పూజా హెగ్డే కి ఇంకా కొన్నాళ్ల పాటు ఇండస్ట్రీ లో స్టార్‌ హీరోలకు జోడీగా నటించాల్సిన సత్తా ఉంది. కానీ ఆమెను ఫిల్మ్‌ మేకర్స్‌ పట్టించుకోక పోవడం దారుణం.


గుంటూరు కారం సినిమాతో పాటు మరి కొన్ని సినిమాల్లో కూడా ఈ అమ్మడు నటించాల్సి ఉన్నా కూడా నటించలేదు. దాంతో ఈమెకు ఆఫర్లు రావడం లేదు. ఒక్క ఛాన్స్ అన్నట్లుగా ఈ అమ్మడు ఎదురు చూస్తోంది. అదృష్టం కలిసి వచ్చి ఒక్క ఛాన్స్‌ దక్కి హిట్‌ అయితే తప్పకుండా ఈ అమ్మడు మరో అయిదు ఆరు సంవత్సరాలు చక్రం తిప్పే అవకాశాలు లేకపోలేదు. మరి ఆ ఒక్క ఛాన్స్‌ దక్కి హిట్‌ అయ్యేనా చూడాలి.