బుట్టబొమ్మ గ్రాఫ్ స్టాక్ మార్కెట్లా కుప్పకూలిపోతుందా?
ముంబై బ్యూటీ పూజాహెగ్డే టాలీవుడ్ ఛాన్సులు కాదని బాలీవుడ్ కి వెళ్లిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదుర్కుందో తెలిసిందే.
By: Tupaki Desk | 20 Feb 2024 6:30 AM GMTముంబై బ్యూటీ పూజాహెగ్డే టాలీవుడ్ ఛాన్సులు కాదని బాలీవుడ్ కి వెళ్లిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదుర్కుందో తెలిసిందే. హిందీలో అవకాశాలు వచ్చినా విజయాలు లేకపోవడంతో సీన్ మొత్తం రివర్స్ అయింది. కెరీర్ ఆరంభంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కుందో ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లోకే జారుకుంటున్నట్లు కనిపిస్తుంది. ఇప్పటికే అమ్మడు మళ్లీ టాలీవుడ్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే.
అయితే ఈసారి డిమాండ్ లెక్క మారినట్లే కనిపిస్తోంది. పూజా ఫాంలో ఉన్నంత కాలం అమ్మడు భారీగానే పారితోషికం తీసుకుంది. ఒక్కో సినిమాకి మూడు కోట్లు ఛార్జ్ చేసిన సందర్భాలున్నాయి. అదనంగా సొంత ప్లైట్ వేసుకుని రావడం...ఆ ఖర్చులు నిర్మాత నెత్తిన వేయడం..ఇంకా అదనపు సిబ్బంది ఇలా రేంజ్ ని మెయింటెన్ చేసింది. ఈ నేపథ్యంలో కోలీవుడ్ నిర్మాతలు గుసాయించిన అంశం అప్పట్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.
అయితే బుట్టబొమ్మ రేంజ్ ఇప్పుడు ఒక్కసారిగా స్టాక్ మార్కెట్ లా కుప్ప కూలిపోతున్నట్లు సమాచారం. ఇప్పటివరకూ ఒక్కో సినిమాకి మూడు కోట్లు అందుకున్న భామ ఒక్కసారిగా కోటిరన్నరకు పడిపోయిందిట. అంతకు మించి తక్కువ ఇచ్చినా సరే సైన్ చేయడానికి సిద్దంగానే ఉంది అని బాలీవుడ్ గుస గుస. ఇక హీరోల పరంగా స్టార్ హీరోలే అవసరం లేదని...మిడ్ రేంజ్ హీరోలైనా సినిమాలు చేయడానికి సిద్దంగానే ఉందనే సంకేతాలు పంపిందిట. ఏదిఏమైనా పూజా డిమాండ్ ఒక్కసారిగా పడిపోయిందన్నది వాస్తవంగానే కనిపిస్తుంది.
అమ్మడికి ఇప్పుడు తెలుగులో అవకాశాలే రావడం లేదు. కోలీవుడ్ లోనూ అదే సన్నివేశం కనిపిస్తుంది. అయితే ఈ రెండు భాషల్లో ఛాన్సులు రాకపోవడానికి కొన్ని ప్రత్యేక కారణాలున్నట్లు వినిపిస్తుంది. ఆ మధ్య ఓ సినిమా విషయంలో అమ్మడు చేసిన పనికి ఇక్కడి నిర్మాతలంతా కలిసి కట్టుగా ఉన్నారనే మాట వినిపి స్తుంది. పక్క పరిశ్రమ నుంచి కూడా ఈరకమైన అంశమే తెరపైకి వస్తోంది. అదే నిజమైతే బుట్టబొమ్మకి అవకాశమే గగనమవుతుందే.