Begin typing your search above and press return to search.

బుట్ట‌బొమ్మ స్ట్రెయిట్ ఎటాకింగ్ సూప‌ర్బ్!

తాజాగా అమ్మ‌డు మ‌రో కొత్త ఫోటోతో నెట్టింట్లోకి వ‌చ్చేసింది. ఇదిగో ఇక్క‌డిలో డిజైన‌ర్ ఔట్ ఫిట్ లో అమ్మ‌డు ఓ బ్లాక్ అండ్ వైట్ ఫోటోని షేర్ చేసింది.

By:  Tupaki Desk   |   5 Feb 2024 8:45 AM GMT
బుట్ట‌బొమ్మ స్ట్రెయిట్ ఎటాకింగ్ సూప‌ర్బ్!
X

పూజాహెగ్డే ఇన్ స్టా సంచ‌ల‌నాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అమ్మ‌డు ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ ఫోటోల‌తో హీటెక్కిస్తూనే ఉంటుంది. ఈ మ‌ధ్య కాలంలో సినిమాలు కూడా త‌గ్గ‌డంతో ఎంట‌ర్ టైన్ మెంట్ ఇన్ స్టాలోనే అందిస్తుంది. అభిమానులకు కావాల్సిన విధంగా సొగ‌స‌రి అందాల విందు ఇస్తోంది. అయితే మునుప‌టి అంత యాక్టివ్ గా ఇప్పుడు ఇన్ స్టాలోనూ క‌నిపించ‌లేదు. మ‌రీ ట‌చ్ లో లేను అనిపించు కోకుండా అప్పుడ‌ప్పుడు కొత్త ఫోటోల‌తో కుర్రాళ్ల‌ని ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేస్తుంది.

తాజాగా అమ్మ‌డు మ‌రో కొత్త ఫోటోతో నెట్టింట్లోకి వ‌చ్చేసింది. ఇదిగో ఇక్క‌డిలో డిజైన‌ర్ ఔట్ ఫిట్ లో అమ్మ‌డు ఓ బ్లాక్ అండ్ వైట్ ఫోటోని షేర్ చేసింది. ఔట్ ఫిట్ లో ఎంతో అందంగా క‌నిపిస్తుంది. ఆ మిర్ర‌ర్ డిజైన్ పూజా అందాన్ని మ‌రింత రెట్టింపు చేసింది. సొగ‌స‌రి హైట్ ని మ్యాచ్ చేస్తూ డిజైన్ చేసిన ఔట్ ఫిట్ ప‌క్కాగా కుదిరింది. ఆ డిజైన్ లో అమ్మ‌డు వివిధ భంగిమ‌ల్లో కెమెరాకి ఫోజులిచ్చింది.

కొన్ని లాంగ్ షాట్స్..క్లోజ‌ప్ షార్స్ట్ పూజాని సంథింగ్ స్పెష‌ల్ గా ఫోక్ చేస్తున్నాయి. ఈ ఫోటోని ఉద్దేశించి ఓ ఆస‌క్తిక‌ర క్యాప్ష‌న్ కూడా ఇచ్చింది. 'లుక్ లైక్ ఏ నీర్ దోస' అని రాసుకొచ్చింది. అలాగే ఓ ల‌వ్ సింబ‌ల్ ఎమోజీని పోస్ట్ చేసింది. కానీ అభిమానులు మాత్రం బ‌ట్ట‌బొమ్మ‌ని మాకు మాత్రం ఎప్ప‌టికీ మ‌ట‌న్ కీమా దోస అంటున్నారు. ఎప్ప‌టిలాగా కామెంట్ బాక్స్ లో ప్ర‌పోజ‌ల్స్ ఏమాత్రం త‌గ్గ‌లేదు. సినిమాలు త‌గ్గినా పూజా ఫాలోయింగ్ ఏమాత్రం త‌గ్గ‌లేదని మ‌రోసారి ప్రూవ్ చేసింది. ల‌వ్ యూ..లుక్స్ గార్జియ‌స్...నెవ‌ర్ బిఫోర్ లుక్ అంటూ పొగిడేస్తున్నారు.

ఇక పూజా టాలీవుడ్ అవ‌కాశాలు కాద‌ని బాలీవుడ్ కి వెళ్లిన త‌ర్వాత ప‌రిస్థితి ఎలా ఉందో తెలిసిందే. అమ్మ‌డికి హిందీ సినిమాలు క‌లిసి రాలేదని వాటి ఫ‌లితాలు చూస్తేనే తెలుస్తోంది. తొలుత లాంచింగ్ అక్క‌డే చేసింది. కానీ వైఫ‌ల్యం టాలీవుడ్ కి తీసుకొచ్చింది. ఇక్క‌డ స‌క్స‌స్ బాట ప‌ట్టింది. కెరీర్ పీక్స్ కి చేరుతుంది అన్న స‌మ‌యంలో మ‌ళ్లీ బాలీవుడ్ కి తిరిగెళ్లింది. కానీ ఆరంభంలో ఎదురైన ప‌రిస్థితులే మ‌ళ్లీ ఎదుర‌వుతున్నాయి.