బ్యూటీకి అక్కడా..ఇక్కడా భలే కంబ్యాక్!
సౌత్ ఇండస్ట్రీని వదిలి నార్త్ లో పాగా వేయాలనుకున్న పూజాహెగ్డేకి అక్కడ ఎలాంటి అనుభవం ఎదురైందో తెలిసిందే
By: Tupaki Desk | 4 Jun 2024 2:45 AM GMTసౌత్ ఇండస్ట్రీని వదిలి నార్త్ లో పాగా వేయాలనుకున్న పూజాహెగ్డేకి అక్కడ ఎలాంటి అనుభవం ఎదురైందో తెలిసిందే. టాలీవుడ్ లో సక్సెస్ లో ఉండాగానే అమ్మడు బాలీవుడ్ కి వెళ్లింది. కానీ తాను అనుకున్నట్లు అక్కడ కెరీర్ సాగని వైనం తెలిసిందే. దీంతో పెద్దగా సమయం వృద్ధా చేయకుండానే సౌత్ లో మీళ్లీ అవకాశాల కోసం ప్రయత్నించింది. సక్సెస్ ల్లో ఉండగా వదిలి వెళ్తే తిరిగి అవకాశాలివ్వడం అన్నది చాలా రేర్ గా జరుగుతుంది.
ఇందులో పూజాహెగ్డే ఆ రేర్ బ్యూటీల్లో ఒకరుగా చెప్పొచ్చు. ఇండస్ట్రీ నుంచి ఎంత సాలిడ్ గా వెళ్లిందో? అంతే సాలిడ్ గాను అమ్మడు సౌత్ లో కంబ్యాక్ అవుతుంది. యువ సామ్రాట్ నాగచైతన్య సరసన ఓ కొత్త సినిమాకి ఇటీవలే సంతకం చేసింది. అతి త్వరలోనే ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. అలాగే కోలీవుడ్ లో సూర్య 44వ చిత్రంలోనూ పూజ అవకాశం అందుకుంది. ఇలా వరుసగా రెండు సినిమాల్లో ఛాన్సులు అందుకోవడం అన్నది చాలా ఈజీగానే జరిగింది. దీన్ని గ్రేట్ కంబ్యాక్ గానే చెప్పాలి.
కంబ్యాక్ లో అవకాశం రావడమే గగనం. ఒకవేళ వచ్చినా సెకెండ్ లీడ్ కే తీసుకుంటారు. కానీ పూజాహెగ్డే మాత్రం అందుకు మినహాయింపుగానే కనిపిస్తుంది. ఒకేసారి ఇద్దరు హీరోలతో ఛాన్సులు అందుకుంది. అయితే ఈ బ్యూటీ విషయంలో కొన్ని కండీషన్లు అప్లై అవుతున్నాయి. తెలుగులో స్టార్ హీరోలతో అవకాశాలు వస్తున్న సమయంలో వెళ్లింది. ఫెయిల్యూర్ నాయికగా వెళ్లలేదు. కోలీవుడ్ లో మాత్రం కాస్త ప్రతికూల వాతావరణమే ఎదురైంది.
తొలుత కోలీవుడ్ లో అమ్మడు కెరీర్ ప్రారింభించింది. ఆ తర్వాత కొన్నేళ్లకు తలపతి విజయ్ సినిమా 'బీస్ట్' లో ఛాన్స్ అందుకుంది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఆ సినిమా ప్లాప్ అయింది. దీంతో మళ్లీ కోలీవుడ్ లో ఛాన్సే లేదనుకున్నారంతా. కానీ ఆ వ్యతిరేకతతో సంబంధం లేకుండా సూర్యతో ఛాన్స్ అందుకోవడం అందర్నీ ఆశ్చర్య పరుస్తున్న విషయం.