అక్కడ గ్లామర్ ఒక్కటే అంటే వర్క్ కాదేమో పాప..?
ఒక సినిమా సక్సెస్ లో ఎక్కువ శాతం హీరోలకే ఎక్కువ క్రెడిట్ ఇచ్చినా కొన్ని సినిమాల్లో కథానాయికలకు కూడా ఆ స్కోప్ వస్తుంది.
By: Tupaki Desk | 18 May 2024 3:46 AMఒక సినిమా సక్సెస్ లో ఎక్కువ శాతం హీరోలకే ఎక్కువ క్రెడిట్ ఇచ్చినా కొన్ని సినిమాల్లో కథానాయికలకు కూడా ఆ స్కోప్ వస్తుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు వేరుగా ఉంటుంది కానీ స్టార్ అండ్ కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ గా పేరు తెచ్చుకోవడం అంత ఈజీ థింగ్ అయితే కాదు. ఎంచుకునే పాత్రలు.. చేస్తున్న సినిమాలు హీరోయిన్ కెరీర్ ని నిర్ణయిస్తాయి. అయితే సక్సెస్ ట్రాక్ ఉన్నంత కాలం బాగానే ఉంటుంది కానీ ఒక్కసారి ట్రాక్ తప్పితే మాత్రం ఛాన్సులు రాబట్టుకోవడం చాలా కష్టం. ప్రస్తుతం అలాంటి డల్ ఫేజ్ లో ఉంది బుట్ట బొమ్మ పూజా హెగ్దే కెరీర్.
తమిళ సినిమా మూగమూడితో హీరోగా తెరంగేట్రం చేసిన పూజా హెగ్దే ఆ తర్వాత తెలుగులో ఒక లైలా కోసం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. మొదటి రెండు సినిమాలు వర్క్ అవుట్ కాకపోయినా సరే దువ్వాడ జగన్నాథ్ సినిమాతో అమ్మడు సక్సెస్ అందుకుని ఆ హిట్ తో కెరీర్ లో తిరుగులేని క్రేజ్ తెచ్చుకుంది. అయితే తెలుగులో వరుసగా స్టార్ సినిమాల్లో నటించిన పూజా హెగ్దే ఇక్కడ ఒక రేంజ్ పాపులారిటీ వచ్చేలా చేసింది. అయినా కూడా అమ్మడి యాక్టింగ్ స్కిల్స్ మీద కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంటారు.
తెలుగులో గ్లామర్ రోల్స్ తో పూజా నెట్టుకొచ్చిందని అంటుంటారు. సరే ఎలా చేసినా ఏం చేసినా తెలుగు ఆడియన్స్ కు పూజా బేబీ మంచి ట్రీట్ అందించిందని చెప్పొచ్చు. అయితే తెలుగులో కాస్త జోరు తగ్గినట్టు అనిపిస్తుండగా కోలీవుడ్ కు షిఫ్ట్ అయ్యింది అమ్మడు. ఆచార్య తర్వాత ఎఫ్ 3 లో క్యామియో చేసిన పూజా హెగ్దే మరో ఛాన్స్ అందుకోలేదు. మరోపక్క హిందీలో షాహిద్ తో దేవా సినిమా చేస్తుంది.
లేటెస్ట్ గా పూజా హెగ్దే కోలీవుడ్ లో లక్కీ ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. స్టార్ హీరో సూర్య సరసన అమ్మడు నటిస్తుందని టాక్. కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్లో తెరకెక్కే ఈ సినిమాలో సూర్య, పూజా జతకడుతున్నారు. అయితే తమిళంలో కేవలం గ్లామర్ తో నెట్టుకు రావడం చాలా కష్టం. అక్కడ ఆడియన్స్ హీరోయిన్స్ ని కూడా హీరోలకు పోటీ పడి నటించాలని భావిస్తారు. రెండేళ్ల క్రితం దళపతి విజయ్ తో బీస్ట్ లో నటించిన పూజా ఆ తర్వాత ఒక్క ఛాన్స్ తెచ్చుకోలేదు. మళ్లీ సూర్య సినిమాతో ఆ అవకాశం వచ్చింది. మరి కేవలం గ్లామర్ ఒక్కటే అన్నట్టు కాకుండా పూజా తన నటనతో కూడా తమిళ ఆడియన్స్ ని మెప్పించాల్సి ఉంటుంది. అలా అయితేనే అమ్మడికి అక్కడ కెరీర్ బాగుంటుంది. ఇక తెలుగులో కూడా పూజాకి ఒక ఆఫర్ వచ్చినట్టు చెబుతున్నారు. దానికి సంబంధించిన డీటైల్స్ మాత్రం బయటకు రావాల్సి ఉంది.