Begin typing your search above and press return to search.

మ‌ళ్లీ టోన్డ్ లెగ్స్‌తో క‌వ్విస్తున్న బుట్ట‌బొమ్మ‌

పూజ ఫర్రి స్కర్ట్, పర్పుల్ క్రాప్ టాప్, పర్పుల్ లెదర్ జాకెట్‌తో కూడిన ఆల్-పర్పుల్ ఎన్‌సెంబుల్ లుక్ ఇప్ప‌టికే వైర‌ల్ అయింది.

By:  Tupaki Desk   |   1 Sep 2023 5:22 AM GMT
మ‌ళ్లీ టోన్డ్ లెగ్స్‌తో క‌వ్విస్తున్న బుట్ట‌బొమ్మ‌
X

త‌న‌దైన అందం న‌ట‌న‌తో మంత్ర‌ముగ్ధుల‌ను చేసిన పూజా హెగ్డే ఇటీవ‌ల తెలుగు తెర‌కు దూర‌మైన సంగ‌తి తెలిసిందే. మ‌హేష్ స‌ర‌స‌న అవ‌కాశం వ‌చ్చినా కానీ దానిని స‌ద్వినియోగం చేసుకోలేక‌పోయింది. త‌న కాలికి త‌గిలిన గాయం ఇబ్బంది పెడుతుండ‌డంతో ఈ ప్రాజెక్టు నుంచి త‌ప్పుకుంద‌ని ప్ర‌చార‌మైంది.


ఏది ఏమైనా పూజా కాళ్ల గురించి ప‌దే ప‌దే యువ‌త‌రం చ‌ర్చించుకునే స‌మ‌య‌మిది. ఇంత‌కుముందు పూజా అంద‌మైన టోన్డ్ లెగ్స్ గురించి సినీక‌వులు గొప్ప గేయాన్ని రాసారు. అల వైకుంఠ‌పుర‌ములో చిత్రంలో మెజారిటీ పార్ట్ పూజా అంద‌మైన టోన్డ్ లెగ్స్ పైనే దృష్టి సారించాడు త్రివిక్ర‌మ్. పూజా కాలి సౌంద‌ర్యాన్ని పొగిడేస్తూ బ‌న్నీ సాంగేసుకోవ‌డం తెలిసిందే.

ఇప్పుడు అదే కాలి సౌంద‌ర్యం లైఫ్‌స్టైల్ ఆసియా ఫోటోషూట్ కి యు.ఎస్.పి గా మారింది. దీంతో పూజా కాలి అందాల్ని ఎలివేట్ చేసేందుకు ఫోటోగ్రాఫ‌ర్లు పోటీప‌డ్డారు. పూజ ఫర్రి స్కర్ట్, పర్పుల్ క్రాప్ టాప్, పర్పుల్ లెదర్ జాకెట్‌తో కూడిన ఆల్-పర్పుల్ ఎన్‌సెంబుల్ లుక్ ఇప్ప‌టికే వైర‌ల్ అయింది. పూజ థై స్లిట్ డిజైన‌ర్ లుక్ అంతే వైర‌ల్ అయింది. ఇప్పుడు కాళ్ల సౌంద‌ర్యాన్ని ప్రదర్శిస్తున్న ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలాన్ని చుట్టేస్తోంది. వంగ పువ్వు రంగు ఫెద‌ర్ అటాచ్ మెంట్ తో డిజైన్ చేసిన ఈ యూనిక్ డ్రెస్ బుట్ట‌బొమ్మ అందాన్ని ప‌దింత‌లు పెంచింద‌ని చెప్పాలి. ముఖ్యంగా పూజా టోన్డ్ లెగ్స్ సౌంద‌ర్యం మ‌రో స్థాయిలో ఎలివేట్ అయ్యింద‌ని కూడా చెప్పాలి.

ఈ లుక్ చూశాక అభిమానులు ల‌వ్ హార్ట్ ఫైర్ ఎమోజీలతో కామెంట్స్ సెక్ష‌న్ లో వేడెక్కించేస్తున్నారు. పూజా అద్భుతమైన అవతార్‌ను చూసినందుకు చాలా మంది ఫ్యాన్స్ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. పూజా చాలా అందంగా హాట్ గా ఉంద‌ని ప‌లువురు కామెంట్లు చేస్తున్నారు. రాధేశ్యామ్ - కిసీ కా భాయ్ చిత్రాల త‌ర్వాత పూజా త‌దుప‌రి చిత్రానికి సంత‌కం చేయ‌లేదు. త‌న కాలి గాయం మానేవర‌కూ ఎలాంటి రిస్కులు తీసుకోలేద‌ని కూడా టాక్ వినిపిస్తోంది.