Begin typing your search above and press return to search.

రెండు జ‌డ‌ల సీత ర‌చ్చ రంబోలా

ఆ అంద‌మైన జూకాలు.. మ‌త్తెక్కించే క‌ళ్లు.. ఎక్స్ ప్రెష‌న్స్ ఇవ‌న్నీ ఈ ఫోటోషూట్ లో అద‌న‌పు హంగులు..

By:  Tupaki Desk   |   11 Aug 2024 1:30 AM GMT
రెండు జ‌డ‌ల సీత ర‌చ్చ రంబోలా
X

రెండు జ‌డ‌లతో గుండె గుల్ల చేస్తోంది.. స్కూల్ యూనిఫాం ధ‌రించి రెండు జ‌డ‌ల్ని భుజాల మీదుగా ముందుకు లాగి వ‌దిలింది. స్కూల్ కి వెళ్లే అమ్మాయి ముంగురులు చెదిరిపోయి గాలికి ఎగురుతున్నాయి. ఆ అంద‌మైన జూకాలు.. మ‌త్తెక్కించే క‌ళ్లు.. ఎక్స్ ప్రెష‌న్స్ ఇవ‌న్నీ ఈ ఫోటోషూట్ లో అద‌న‌పు హంగులు..


ఇంత‌కీ ఎవ‌రీ రెండు జ‌డ‌ల సీత‌? అంటే.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు.. ది గ్రేట్ పూజా హెగ్డే. తెలుగు లోగిళ్ల‌లో బుట్ట‌బొమ్మ‌గా పాపుల‌రైన ఈ బ్యూటీ, ఇటీవ‌ల కొన్ని వ‌రుస ప‌రాజ‌యాల‌తో రేసులో వెన్కక్కి త‌గ్గింది. కానీ కెరీర్ ప‌రంగా ఎలాంటి డోఖా లేదు. అటు హిందీ ఇటు తెలుగు చిత్రాల్లో అవ‌కాశాలు అందుకుంటూనే ఉంది. కాంపిటీష‌న్ ఎంత ఉన్నా త‌న‌కు పోటీ అన్న‌దే లేద‌ని కూడా నిరూపించ‌డం బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే ప్ర‌త్యేక‌త‌. పూజా స్పెష‌ల్ ఎక్స్ ప్రెష‌న్స్ యూనిక్ డ్రెస్ సెన్స్ తో లేటెస్ట్ ఫోటోషూట్ ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తోంది.


కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... బాలీవుడ్ అగ్ర హీరో షాహిద్ క‌పూర్ స‌ర‌స‌న `దేవా` అనే భారీ యాక్ష‌న్ చిత్రంలో పూజా హెగ్డే న‌టిస్తోంది. అలాగే కంబ్యాక్ కోసం టాలీవుడ్ లో ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌తో మంత‌నాలు సాగిస్తోంద‌ని టాక్ ఉంది. పూజా హెగ్డే కోలీవుడ్‌లో తన కెరీర్‌లో అత్యధిక పారితోషికం తీసుకుంటోంద‌ని కూడా ప్ర‌చారం సాగుతోంది. టాలీవుడ్‌లో ప్రతి చిత్రానికి రూ. 2.5 నుండి 3 కోట్ల మధ్య వ‌సూలు చేసి పూజా పారితోషికాన్ని పెంచింద‌ని కోలీవుడ్ మీడియాలో గుస‌గుస వినిపిస్తోంది. మహేష్ బాబు, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ , అల్లు అర్జున్ వంటి పెద్ద స్టార్‌లతో కలిసి పని చేసిన పూజా కోలీవుడ్ లో విజ‌య్ స‌ర‌స‌న అవ‌కాశాలు అందుకుంది. ప‌లువురు కోలీవుడ్ అగ్ర హీరోలు ఈ భామ‌కు అవ‌కాశాలిచ్చార‌ని తెలుస్తోంది. త‌న త‌దుప‌రి ప్రాజెక్టుల గురించి పూజా వెల్ల‌డించాల్సి ఉంది.