Begin typing your search above and press return to search.

బ్లాక్ అండ్‌ వైట్‌లో పొన్నాడ సూపర్‌

బ్లాక్ అండ్ వైట్‌ లో క్లోజప్‌ పిక్స్‌ను షేర్‌ చేసింది. ఇంత అందంగా ఉన్న పూజిత పొన్నాడకి దక్కాల్సిన స్థాయిలో ఆఫర్లు దక్కడం లేదని అభిమానులు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   13 March 2025 12:06 AM IST
బ్లాక్ అండ్‌ వైట్‌లో పొన్నాడ సూపర్‌
X

నాగార్జున, కార్తీ హీరోలుగా నటించిన 'ఊపిరి' సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన పూజిత పొన్నాడ మెల్ల మెల్లగా ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటూ వస్తుంది. రామ్ చరణ్ హీరోగా నటించిన 'రంగస్థలం' సినిమాలో పూజిత పొన్నాడ ముఖ్య పాత్రలో నటించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. అప్పటి నుంచి చిన్న సినిమాల్లో మెయిన్ హీరోయిన్‌గా పెద్ద హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా తమిళ్‌లోనూ ఈమె నటించింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మూవీ హరి హర వీరమల్లు సినిమాలో పూజిత కీలక పాత్రలో నటిస్తున్న తెలుస్తోంది.

యంగ్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా సినిమాలు చేస్తున్న పూజిత పొన్నాడ సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌గా తన అందమైన ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. సినిమాలతోనే కాకుండా రెగ్యులర్‌గా తన అందమైన ఫోటోలతో అలరిస్తున్న పూజిత పొన్నాడ మరోసారి తన అందమైన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్‌తో పంచుకుంది. ఎప్పటిలాగే ఈసారి కూడా తన అందమైన లుక్‌తో పాటు స్టైలిష్ అవతార్‌లో పూజిత పొన్నాడ కనిపించింది. అలరించే అందంతో పాటు బ్లాక్ అండ్‌ వైట్‌లో చూపు తిప్పనివ్వకుండా అందంగా కనిపిస్తుంది.

బ్లాక్ అండ్ వైట్‌ లో క్లోజప్‌ పిక్స్‌ను షేర్‌ చేసింది. ఇంత అందంగా ఉన్న పూజిత పొన్నాడకి దక్కాల్సిన స్థాయిలో ఆఫర్లు దక్కడం లేదని అభిమానులు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈమెకు ఉన్న ఫాలోయింగ్‌కి తగ్గట్లుగా సినిమా ఆఫర్లు దక్కడం లేదనే అభిప్రాయంను పలువురు వ్యక్తం చేస్తున్నారు. ముందు ముందు అయినా పూజిత పొన్నాడకి స్టార్‌ హీరోల సినిమాల్లో నటించే అవకాశాలు రావాలని నెటిజన్స్ కోరుకుంటున్నారు. ఈ ఏడాదిలో పూజిత నుంచి రెండు మూడు సినిమాలు అయినా వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

పవన్‌ కళ్యాణ్‌ తో ప్రస్తుతం నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటే తప్పకుండా మరిన్ని సినిమాలు ఈ అమ్మడికి దక్కే అవకాశాలు ఉన్నాయి. భగవన్ అనే తమిళ్‌ సినిమాలోనూ ఈమె నటిస్తుంది. త్వరలోనే ఈమె మరో తెలుగు సినిమాలోనూ నటించబోతున్నట్లు సమాచారం అందుతోంది. మరో వైపు వెబ్‌ సిరీస్‌ల్లోనూ ఈమెకు నటించే అవకాశాలు వస్తున్నాయట. త్వరలోనే ఈమె వెబ్‌ సిరీస్‌లోనూ నటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. ఇలాంటి ఫోటోలను షేర్ చేయడం ద్వారా ఇండస్ట్రీ నుంచి మరిన్ని ఆఫర్లు దక్కే అవకాశాలు ఉన్నాయి.