Begin typing your search above and press return to search.

పొట్టి గౌనులో పూనమ్ పాప అల్ట్రా గ్లామర్ ట్రీట్!

సోషల్ మీడియాలో తన అందంతో అభిమానులను అలరిస్తూ అవకాశాల కోసం వెయిట్ చేస్తోంది.

By:  Tupaki Desk   |   15 Jan 2025 2:30 PM GMT
పొట్టి గౌనులో పూనమ్ పాప అల్ట్రా గ్లామర్ ట్రీట్!
X

పూనమ్ బాజ్వా కెరీర్‌ తొలి రోజుల్లోనే తన అందం నటనతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. మోడలింగ్ ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పూనమ్, ముఖ్యంగా తెలుగు, తమిళ, మలయాళ సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. 'మొదటి సినిమా' అనే సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన అమ్మడికి మొదట్లోనే మంచి అవకాశాలను అందుకుంది. అయితే, మొదట్లో ట్రెడిషినల్ పాత్రలకే ఎక్కువగా పరిమితమవడం వల్ల స్టార్‌ హీరోయిన్‌ స్థాయికి ఎదగలేకపోయింది.


మలయాళ చిత్రాలలో ఆమెకు మంచి అవకాశాలు లభించాయి, ముఖ్యంగా చిన్నా టౌన్ వంటి చిత్రాలు ఆమెకు గుర్తింపు తెచ్చాయి. పూనమ్ కెరీర్‌లో కొన్ని విరామాల తరువాత సెకండ్ ఇన్నింగ్స్‌ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. సోషల్ మీడియాలో తన అందంతో అభిమానులను అలరిస్తూ అవకాశాల కోసం వెయిట్ చేస్తోంది.


సోషల్ మీడియాలో పూనమ్ బాజ్వా హాట్‌ టాపిక్‌గా నిలుస్తోంది. ఇటీవల విడుదలైన ఫోటోలలో, ఆమె తెల్లని చిన్న డ్రెస్‌లో ఎంతో ఆహ్లాదకరంగా కనిపించింది. ఒంపుసొంపుల డ్రెస్‌కి సరిపడే కాటాయ్‌ గ్లాసెస్‌తో బీచ్‌ బ్యాక్‌డ్రాప్‌ లో కనిపించిన ఈ లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మినిమల్ మెకప్‌తో తన సహజ అందాన్ని చూపిస్తూ ఫ్యాన్స్‌ నుండి ప్రశంసలు అందుకుంది.


ఈ ఫోటోలలో పూనమ్‌ ఒదిగిన తళుకుల డ్రెస్ ఆమె గ్లామర్‌ను మరో మెట్టు ఎక్కించింది. సముద్ర తీరంలో సూర్యాస్తమయం నడుమ ఆమె తీసుకున్న స్టైలిష్‌ పోజులు నెటిజన్లను మైమరపించాయి. ప్రత్యేకంగా ఆమె ఫిట్నెస్‌ మెయింటెనెన్స్‌ ప్రశంసలందుకుంది. ఈ ఫోటోలకు లైక్స్‌, కామెంట్స్‌ కురుస్తున్నాయి. ప్రస్తుతం పూనమ్‌ పెద్దగా అవకాశాలు పొందలేదు. అయినప్పటికీ, కొత్త తరహా పాత్రల కోసం ప్రయత్నాలు చేస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆమెకు మరిన్ని అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.