Begin typing your search above and press return to search.

మాకేం సమస్యలు ఉండవన్న పూనమ్.. రేవంత్ తో మీటింగ్ పై సెటైర్!

నటి పూనమ్ కౌర్.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా పోస్టులతో ట్రెండింగ్ లో ఉంటారన్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   27 Dec 2024 6:20 AM GMT
మాకేం సమస్యలు ఉండవన్న పూనమ్.. రేవంత్ తో మీటింగ్ పై సెటైర్!
X

నటి పూనమ్ కౌర్.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా పోస్టులతో ట్రెండింగ్ లో ఉంటారన్న విషయం తెలిసిందే. పలు సమస్యలు, సామాజిక అంశాలపై ఆమె తన గొంతు వినిపిస్తుంటారు. తన కామెంట్స్ తో వైరల్ అవుతుంటారు ఒక్కోసారి ఆమె ట్వీట్స్ వివాదాస్పదంగా మారుతుంటాయి. తాజాగా ఎక్స్ లో మరో పోస్ట్ పెట్టారు పూనమ్ కౌర్.


మహిళలెవరూ సీఎం సమావేశానికి వెళ్లేంత ముఖ్యమైన వ్యక్తులుగా పరిగణించబడలేదని పూనమ్ కౌర్ అన్నారు. ఎందుకంటే మహిళలకు ఎలాంటి సమస్యలు ఉండవని వ్యంగ్యంగా మాట్లాడారు. వ్యాపార లేదా ఇతర విషయాల్లో హీరోలకు సమస్యలు వచ్చినప్పుడు ఇండస్ట్రీ అంతా సపోర్ట్ గా నిలబడుతుందని పూనమ్ వ్యాఖ్యానించారు.

అదే సమయంలో మహిళకు ఒక్క సమస్య కూడా ఉండదంటూ వ్యంగ్యాస్తాలు సంధించారు. అయితే పూనమ్ కౌర్ పోస్ట్.. నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖులు జరిపిన భేటీని ఉద్దేశించినదేనని క్లియర్ గా తెలుస్తుంది. దీంతో ఆమె పోస్ట్ వైరల్ గా మారగా.. ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. తమ అభిప్రాయాలు చెబుతున్నారు.

అయితే ఇన్ స్టా స్టోరీలో సీఎం రేవంత్ రెడ్డి పేరును ప్రస్తావించారు పూనమ్. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన సామాన్య మహిళ రేవతి గురించి చాలా బాధపడుతున్నారని అన్నారు. కానీ మీటింగ్ లో ఒక్క మహిళ కూడా లేరేంటని అడగలేకపోయారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు పూనమ్ పోస్టులు వైరల్ అయ్యాయి.

ఇక నిన్న హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఉన్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ముఖ్యమంత్రితో టాలీవుడ్ కు చెందిన సుమారు 50 ప్రముఖులు భేటీ అయిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ముందు సినీ పెద్దలు.. కొన్ని కీలకమైన ప్రతిపాదనలు ఉంచగా.. సర్కార్ కూడా కొన్ని ప్రతిపాదనలు ఉంచింది. వివిధ సూచనలు కూడా చేసింది.

అయితే ఆ సమావేశానికి హీరోల్లో వెంకటేష్, నాగార్జున, శివ బాలాజీ, కిరణ్ అబ్బవరం, సిద్ధు జొన్నలగడ్డ తదితరులు వచ్చారు. నిర్మాతల్లో నాగ వంశీ, కేఎల్ నారాయణ, నవీన్, రవిశంకర్, దానయ్య పలువురు హాజరయ్యారు. దర్శకుల్లో రాఘవేంద్రరావు, త్రివిక్రమ్, కొరటాల శివ, వీర శంకర్ సహ మరికొందరు డైరెక్టర్స్ అటెండ్ అయ్యారు. మహిళా సెలబ్రిటీలెవరూ కనిపించలేదు. ఇప్పుడు ఆ విషయమైనే పూనమ్ స్పందించారు!