Begin typing your search above and press return to search.

'ప‌వ‌ర్ రే*పిస్ట్' అంటూ పూన‌మ్ కౌర్ ప్ర‌శంస‌!

పూన‌మ్ కౌర్ సోష‌ల్ మీడియా యాక్టివిటీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అప్పుడ‌ప్పుడు వివాదాస్ప‌ద కంటెంట్ తో వార్త‌ల్లో అగ్ర భాగాన నిలుస్తుంటుంది.

By:  Tupaki Desk   |   5 Sep 2024 12:26 PM GMT
ప‌వ‌ర్ రే*పిస్ట్ అంటూ పూన‌మ్ కౌర్ ప్ర‌శంస‌!
X

పూన‌మ్ కౌర్ సోష‌ల్ మీడియా యాక్టివిటీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అప్పుడ‌ప్పుడు వివాదాస్ప‌ద కంటెంట్ తో వార్త‌ల్లో అగ్ర భాగాన నిలుస్తుంటుంది. స్పందించిన ప్ర‌తీసారి సాలిడ్ కంంటెంట్ తోనే వ‌స్తుంది. ఇండ‌స్ట్రీ లో ఇద్ద‌రు వ్య‌క్తుల్ని ప్ర‌త్యేకంగా టార్గెట్ చేస్తూ ఆమె గ‌తంలో చేసిన వ్యాఖ్య‌లు..ఈ మ‌ధ్య‌నే చేసిన వ్యాఖ్య‌లు నెట్టింట ఎంత సంచ‌ల‌న‌మ‌య్యాయో తెలిసిందే.

తాజాగా ఏపీలో హాట్ టాపిక్ అయిన టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం పై వ‌చ్చిన లైంగిక ఆరోపణ‌ల‌పై స్పందించింది. జిల్లా మ‌హిళా అధ్యక్షురాలు వ‌ర‌ల‌క్ష్మిని ఆదిమూలం వేధిస్తున్న‌ట్లు ఆమె కొన్ని ఆధారాలు కూడా బ‌య‌ట పెట్టిన సంగ‌తి తెలిసిందే.

దీంతో ఆదిమూలం పేరు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఈ నేప‌థ్యంలో పూన‌మ్ కౌర్ రంగంలోకి దిగేసింది. `పవర్ రేపి*స్ట్ ` ని బయటపెట్టమని తన భాగస్వామిని ప్రోత్సహించిన భర్తను చాలా అభినంది స్తున్నాను . అతను అలా చేయకపోతే నుండి ఎమ్మెల్యే సస్పెండ్ అయ్యేవాడు కాదు . చాలా మంది అధికారంలో ఉన్న తాము మౌనంగా ఉండండి అని చెబుతారు. అతనికి వందనాలు.

తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనపై లైంగిక దాడి చేశారంటూ జిల్లా మహిళా అధ్యక్షురాలు వరలక్ష్మీ మీడియా ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. త‌న‌ని క‌క్ష గ‌ట్టి వేధించ‌డంతో భ‌ర్త ఇచ్చిన స‌ల‌హాతో ఆదిమూలం అడ్డంగా బుక్య‌య్యాడు.