ఫ్యాన్ బలవంతంగా ముద్దు.. షాక్‌లో పూనమ్ పాండే
పూనమ్ ని ఇటీవల ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఔట్‌డేటెడ్ నటి కం మోడల్ కావడంతో అంతగా క్రేజ్ లేదు. పబ్లిక్ దాదాపుగా మర్చిపోయారు.
By: Tupaki Desk | 21 Feb 2025 2:13 PM GMTఅతడు ఆమె వెనక నుంచి వచ్చాడు. సెల్ఫీ పేరుతో చనువుగా దగ్గరయ్యాడు. మీది మీదికి వచ్చాడు. బుగ్గపై లటుక్కున ముద్దు లాగించేయబోయాడు. అభిమాని దూకుడికి ఖంగుతిన్న సదరు నటి కం మోడల్ వెంటనే తేరుకుని అతడిని దూరంగా నెట్టేసింది. ప్రస్తుతం ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది. శృంగార చిత్రాల నటిగా పాపులరైన పూనమ్ పాండేను పబ్లిక్ లో ముద్దు పెట్టుకోబోయిన అభిమాని తెగువ ఆశ్చర్యపరచగా, అతడికి నాలుగు వడ్డించకుండా పూనమ్ అనుచరులు పద్ధతిగా సర్ది చెప్పి పంపేయడం కూడా ఆశ్చర్యపరిచింది.
నిజానికి ఇది నిజమే అయితే పెద్ద గొడవకు దారి తీసేదని కొందరి అనుమానం. పూనమ్ అసిస్టెంట్స్ అతడిని ఏమీ చేయకుండా విడిచిపెట్టారు. కానీ పూనమ్ అప్పటికే తేరుకోలేని స్థితిలో కనిపించింది. అతడు దగ్గరగా వచ్చి బుగ్గపై ముద్దు పెట్టేయాలని చాలా కసిగా కనిపించాడు. కానీ చివరి నిమిషంలో అచేతనంగా అతడిని పూనమ్ గట్టిగా దూరంగా నెట్టింది కానీ.. ఆ సమయంలో ఇంకేదైనా జరిగేదే! ఆ సీన్ కి సంబంధించిన విజువల్ నిజంగా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పబ్లిక్ ఫిగర్స్ కి పబ్లిక్ లో ప్రమాదాలు ఎలా ముంచుకొస్తాయో అర్థమయ్యేలా చెప్పింది ఈ ఘటన.
అయితే ఇన్‌స్టాగ్రామ్ లో కొందరు ఇదంతా ప్రీప్లాన్డ్, స్క్రిప్టెడ్ వీడియో అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. కొందరు వెనకబడిన సెలబ్రిటీలు పబ్లిక్ లో ఇలాంటివి ప్లాన్ చేయడం ద్వారా తమకు తాము ప్రచారం కోరుకుంటున్నారు. పూనమ్ ని ఇటీవల ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఔట్‌డేటెడ్ నటి కం మోడల్ కావడంతో అంతగా క్రేజ్ లేదు. పబ్లిక్ దాదాపుగా మర్చిపోయారు. ఇలాంటి సమయంలో ఇలాంటివి చేస్తేనే ఆమెను ఎవరైనా చూడగలరు అంటూ సోషల్ మీడియాల్లో వ్యాఖ్యానిస్తున్నారు. ఒక నెటిజన్.. మొదటి నుండి ఆమె అసౌకర్యంగా ఉండటం నడుచుకున్న తీరుపై నాకు అనుమానంగా ఉంది అని రాశారు. మరొకరు.. ఆమె ఎంత చెడ్డగా నటించిందో నాకు అర్థమవుతోంది! అని వ్యాఖ్యానించారు.
గత సంవత్సరం, గర్భాశయ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడానికి పూనమ్ పాండే తాను చనిపోయానని ప్రచారం చేయించుకుంది. దేశవ్యాప్తంగా షాక్ వేవ్‌లు పంపాక, పూనమ్ తాను బతికే ఉన్నానని ప్రకటించడంతో భారీ ట్రోలింగ్‌కు గురైంది. ప్రచారం కోసం పూనమ్ ఎంతకైనా తెగబడుతుందని అందరికీ అనుమానం ఉంది. ఇలాంటి సమయంలో ఇప్పుడు ఈ ముద్దు నాటకం గురించి చర్చ సాగుతోంది. అయితే అతడు నిజంగా టెంప్ట్ అయ్యి ముద్దు పెట్టబోయాడా? లేక కేవలం స్క్రిప్ట్ ప్రకారం తెరకెక్కించిన వీడియోనా? అన్నది తేలాల్సి ఉంది.
ఏళ్ల తరబడి పూనమ్ పాండే తన వివాదాస్పద ప్రకటనలు, సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటోలు వీడియోలతో మనుగడ సాగించింది. ఫిలింమేకర్ సామ్ బాంబేతో తన అల్లకల్లోల వివాహం, విడాకుల వ్యవహారం రచ్చయిన సంగతి తెలిసిందే.