'ఏమైనా అయితే బాధ్యత ఎవరిది సామ్?' గుత్తా, పూనమ్ ఫైర్!
అయితే సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటోంది. ఎప్పటికప్పుడు కొత్త ఫోటో షూట్స్ పోస్ట్ చేస్తూనే.. ఆ మధ్య వివిధ థెరపీల గురించి వివరంగా చెప్పింది.
By: Tupaki Desk | 7 July 2024 9:59 AM GMTటాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ బారినపడి.. దాదాపు ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే మళ్లీ బిజీ అవుతోంది. త్వరలోనే సిటాడెల్ వెబ్ సిరీస్ తో సందడి చేయనుంది. తన బర్త్ డే రోజు ఒక కొత్త సినిమాను అనౌన్స్ చేసింది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. షూటింగ్ మొదలైందో లేదో కూడా ఎవరికీ తెలియదు. దీంతో ఆమె ఇంకా చికిత్స తీసుకుంటుందని టాక్ వినిపిస్తోంది.
అయితే సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటోంది. ఎప్పటికప్పుడు కొత్త ఫోటో షూట్స్ పోస్ట్ చేస్తూనే.. ఆ మధ్య వివిధ థెరపీల గురించి వివరంగా చెప్పింది. ఫిట్ నెస్ తో పాటు హెల్త్ కు సంబంధించి పలు టిప్స్ ను తన ఫాలోవర్స్ కోసం పంచుకుంటోంది. ఆ క్రమంలో ఆమె చేసిన ఒక పోస్ట్ వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. నెబ్యులైజర్ కు సంబంధించి సామ్ పెట్టిన పోస్ట్ పై పలువురు సెలబ్రిటీలు, డాక్టర్లు స్పందించి ఫైర్ అవుతున్నారు.
ఇదే సమయంలో ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్, తమిళ హీరో విష్ణు విశాల్ సతీమణి గుత్తా జ్వాల కూడా రెస్పాండ్ అయింది. సమంత పేరును ప్రస్తావించకుండా ఘాటుగా ట్వీట్ చేసింది. "ప్రజలకు హెల్త్ టిప్స్ చెబుతున్న సెలబ్రిటీలను నేను ఒకే ఒక్క ప్రశ్న అడుగుతున్నాను. మీ చికిత్స విధానం అవతలి వారికి ఉపయోగ పడకపోగా చనిపోతే పరిస్థితేంటి?" అని సూటిగా ప్రశ్నించింది. సాయం చేసే ఆలోచన మంచిదేనని చెప్పింది గుత్తా.
"కానీ జరగరానిది జరిగితే ఏం చేస్తారు? దానికి మీరు ఏమైనా బాధ్యత వహిస్తారా? మీకు సలహా ఇచ్చిన డాక్టర్ అయినా బాధ్యత తీసుకుంటారా?" అంటూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మండిపడింది. అదే సమయంలో హీరోయిన్ పూనమ్ కౌర్.. జ్వాల ట్వీట్ కు రిప్లై ఇచ్చింది. 'ఇది సెల్ఫ్ గ్లోరిఫికేషన్ జ్వాల, ఇదంతా డార్క్ రియాలిటీ' అని పూనమ్ వ్యాఖ్యానించింది. ప్రస్తుతం గుత్తా జ్వాల, పూనమ్ కౌర్ ట్వీట్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి.
అసలేమైంది?
రీసెంట్ గా సమంత.. తాను నెబ్యులైజర్ ను ఉపయోగిస్తున్న ఒక ఫోటోను షేర్ చేసి.. "సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు డిస్టిల్డ్ వాటర్ లో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి నెబ్యులైజ్ చేయండి" అని సలహా ఇచ్చింది. అయితే అలా చేస్తే ప్రాణాలకు చాలా ప్రమాదమని తెలిపారు కొందరు వైద్యులు. దీంతో ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. అనేక మంది స్పందిస్తున్నారు. మరి ఈ వివాదం నుంచి సామ్ ఎలా బయటపడుతుందో చూడాలి.