Begin typing your search above and press return to search.

పూనమ్ బజ్వా.. క్రేజీ పిక్స్ తో మాయ!

తాజాగా అదిరిపోయే పిక్స్ ను పోస్ట్ చేసి సర్ప్రైజ్ చేసింది అమ్మడు. కాఫీ తాగుతూ సింపుల్ గా పోజులిచ్చింది.

By:  Tupaki Desk   |   29 July 2024 1:56 PM GMT
పూనమ్ బజ్వా.. క్రేజీ పిక్స్ తో మాయ!
X

అందం, అభినయం సమపాళ్లలో ఉన్నా.. సరైన ఆఫర్లు అందుకోలేక సైలెంట్ అయిన వారిలో ఫేమస్ హీరోయిన్ పూనమ్ బజ్వా ఒకరన్న విషయం తెలిసిందే. టాలీవుడ్ లో కొన్నేళ్ల పాటు సందడి చేసిన ముద్దుగుమ్మ.. తెలుగు సినిమాల్లో కనిపించి రెండేళ్లు అవుతుంది. ఇప్పుడు అవకాశాలు కూడా ఆమెకు రావడం లేదు. చివరగా సీనియర్ ఎన్టీఆర్ కథానాయకుడు మూవీలో కనిపించింది. ఇప్పుడు తెలుగులో మళ్లీ రీఎంట్రీ ఇచ్చి ఆఫర్లు అందుకోవాలని చూస్తోంది అమ్మడు.

మోడల్ గా ఫుల్ పాపులర్ అయిన పూనమ్.. మొదటి సినిమా అనే మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ప్రేమంటే ఇంతే, బాస్, వేడుక, పరుగు సినిమాల్లో నటించింది. కానీ సరైన హిట్లు అందుకోలేకపోయింది. ఆ తర్వాత కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్ వుడ్ లో పలు చిత్రాలు చేసి అలరించింది. 2022లో పఠోన్పథం నూట్టండు, మే హూమ్ మూసా, గురుమూర్తి సినిమాలు చేసిన పూనమ్.. ఇప్పటి వరకు మరో మూవీలో నటించలేదు.

చిన్న గ్యాప్ తీసుకున్న బ్యూటీ.. ఇప్పుడు మళ్లీ వరుస సినిమాలతో బిజీ అయ్యేందుకు సిద్ధమవుతోంది. ఆ మధ్య తన బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసింది. పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పింది. కానీ ఇప్పటి వరకు పెళ్లి కహానీ అనౌన్స్ చేయలేదు. కెరీర్ సంగతి ఎలా ఉన్నా.. సోషల్ మీడియాలో పూనమ్ బజ్వా సందడే వేరు. ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ ఫాలోవర్స్ ను పెంచుకుంటూ ఉంటోంది. తన పర్సనల్ అప్డేట్స్ తోపాటు వెకేషన్ కు వెళ్లి పిక్స్ ను షేర్ చేస్తుంటోంది.

ఇన్ స్టాగ్రామ్ లో ASK ME పేరుతో చిట్ చాట్ సెషన్స్ నిర్వహిస్తుంటోంది. ఆ సమయంలో నెటిజన్లు అడిగిన పలు క్వశ్చన్స్ కు ఆన్సర్లు ఇస్తూ టచ్ లో ఉంటోంది. యోగాతోపాటు జిమ్ చేస్తున్న పిక్స్, వీడియోస్ ను పోస్ట్ చేస్తూనే ఉంటుంది. గ్లామర్ డోస్ పెంచి మరీ అలరిస్తుంటోంది. తాజాగా అదిరిపోయే పిక్స్ ను పోస్ట్ చేసి సర్ప్రైజ్ చేసింది అమ్మడు. కాఫీ తాగుతూ సింపుల్ గా పోజులిచ్చింది. హెయిర్ లీవ్ చేసి క్యూట్ గా చూస్తూ నెటిజన్లను అలరిస్తోంది. ప్రస్తుతం పూనమ్ పిక్స్ కు లైకుల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. ఫిదా అయ్యామని చెబుతున్నారు.