Begin typing your search above and press return to search.

ఎల్లో చీరలో 'మొదటి సినిమా' హీరోయిన్‌

తక్కువ సమయంలోనే ఈ అమ్మడు టాలీవుడ్‌ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

By:  Tupaki Desk   |   24 Aug 2024 1:30 AM GMT
ఎల్లో చీరలో మొదటి సినిమా హీరోయిన్‌
X

2005 సంవత్సరంలో నవదీప్‌ హీరోగా నటించిన 'మొదటి సినిమా' తో హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ పూనమ్‌ బజ్వా. తక్కువ సమయంలోనే టాలీవుడ్‌ లో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. మొదటి సినిమా నిరాశ పరిచిన కూడా వరుసగా ఆఫర్లు వచ్చాయి. అయితే ఈ అమ్మడు వచ్చిన ప్రతి ఆఫర్‌ ను కమిట్ అవ్వడం వల్ల వరుసగా డిజాస్టర్స్‌ పడ్డాయి. దాంతో మెల్ల మెల్లగా ఈ అమ్మడి కెరీర్‌ లో డౌన్ ఫాల్‌ స్టార్ట్ అయ్యింది. తక్కువ సమయంలోనే ఈ అమ్మడు టాలీవుడ్‌ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.


టాలీవుడ్‌ లో ఆఫర్లు తగ్గిన వెంటనే కన్నడం, తమిళం మరియు మలయాళం సినిమాల వైపు చూసింది. అదృష్టం కొద్ది టాలీవుడ్‌ లో దక్కని హిట్స్ మరియు కమర్షియల్‌ పాత్రలు ఇతర భాషల్లో దక్కాయి. దాంతో వరుసగా అక్కడ సినిమాలు చేసింది. అప్పుడప్పుడు తెలుగు లో కూడా మెరిసింది కానీ ఎప్పటి మాదిరిగానే టాలీవుడ్‌ ప్రేక్షకులు ఈమె ను తిరస్కరిస్తూ వచ్చారు. సోషల్‌ మీడియాలో పూనమ్‌ బజ్వా అందమైన ఫోటోలు షేర్ చేయడం ద్వారా రెగ్యులర్‌ గా వార్తల్లో నిలుస్తున్న విషయం తెల్సిందే. తాజాగా మరోసారి అందమైన ఫోటోలతో వార్తల్లో నిలిచింది.

ఈసారి ఎల్లో చీర కట్టు తో నడుము అందం చూపిస్తూ, చీరలో ఇంతకు మించి అందంగా ఎవరు ఉండరేమో అన్నంత అందంగా పూనమ్‌ బజ్వా కనిపిస్తోంది. ఆకట్టుకునే అందం తన సొంతం అంటూ ఈ ఫోటోలతో చెప్పకనే చెబుతోంది. అందమైన ఈ అమ్మడి అందానికి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. తెలుగు లో ఇంతటి అందానికి దక్కాల్సిన ఆఫర్లు దక్కలేదు అంటూ కొందరు తెలుగు నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ ఉంటే కొందరు మాత్రం తెలుగు లో కంటే ఇతర భాషల్లో ఈమె ఎక్కువ ఆఫర్లు తెచ్చుకోవడం సంతోషం అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.

పంజాబీ ముద్దుగుమ్మ అయిన పూనమ్‌ బజ్వా 2005 లో మిస్‌ పూణే కిరీటాన్ని సొంతం చేసుకుంది. మోడలింగ్‌ చేస్తున్న సమయంలో హైదరాబాద్‌ కి ఒక ర్యాంప్‌ షో కోసం వచ్చిన సమయంలో మొదటి సినిమా ఛాన్స్ దక్కిందట. 12వ తరగతి చదువుతున్న సమయంలోనే పూనమ్‌ బజ్వా కి హీరోయిన్‌ గా ఛాన్స్ వచ్చిందట. కాలేజ్ కి ఐదు నెలల సమయం ఉండటంతో ఆ గ్యాప్‌ లో సినిమాను అంగీకరించి పూర్తి చేసిందట. సినిమాల్లో నటిస్తూ కూడా పుణెలోని సింబయాసిస్ ఇంటర్నేషనల్‌ యూనివర్శిటీలో ఇంగ్లిష్ లిటరేచర్‌ లో డిగ్రీని పూర్తి చేసింది. ప్రస్తుతం నటనపై పూర్తి దృష్టి పెట్టింది.