Begin typing your search above and press return to search.

పూనమ్ స్టన్నింగ్ లుక్స్.. మైండ్ బ్లాకే

ఎప్పటికప్పుడు గ్లామరస్ పిక్స్ ను పోస్ట్ చేస్తూ.. కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. పొట్టి పొట్టి డ్రెస్సులు, మోడ్రన్ ఔట్ ఫిట్స్ లో అందాలు ఆరబోస్తుంటోంది.

By:  Tupaki Desk   |   19 July 2024 1:27 PM GMT
పూనమ్ స్టన్నింగ్ లుక్స్.. మైండ్ బ్లాకే
X

పూనమ్ బజ్వా.. ఈ బ్యూటీ గుర్తుందా? మొదటి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఎవరైనా మొదటి సినిమాతోనే ఎంట్రీ ఇస్తారు కదా అని అనుకోవద్దు. ఆమె యాక్ట్ చేసిన ఫస్ట్ మూవీ పేరే మొదటి సినిమా. సుమారు 19 ఏళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమాలో క్యూట్ గా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంది. అందం, అభినయంతో అలరించింది. కుర్రాళ్ల మనసులు దోచేసింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది.

మోడల్ గా మంచి పేరు సంపాదించుకున్న పూనమ్.. మొదటి సినిమా తర్వాత కింగ్ నాగార్జున బాస్ తో పాటు ప్రేమంటే ఇంతే, వేడుక, పరుగు సినిమాల్లో యాక్ట్ చేసి మెప్పించింది. కానీ సరైన హిట్ అందుకోలేకపోయింది. దీంతో వేరే భాషల్లో పలు సినిమాలు చేసింది అమ్మడు. టాలీవుడ్ కన్నా కోలీవుడ్ లోనే ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. స్టార్టింగ్ లో స్కోప్ ఉన్న రోల్స్ అందుకున్నా.. ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలకు పరిమితమైంది.

చివరగా తెలుగులో ఎన్టీఆర్ కథానాయకుడు మూవీలో యాక్ట్ చేసింది. ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పలు తమిళ, మలయాళ చిత్రాల్లో కూడా నటిస్తోంది. కెరీర్ సంగతి ఎలా ఉన్నా.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది పూనమ్. ఓ రేంజ్ లో సందడి చేస్తుంటోంది. రోజురోజుకు ఫాలోవర్స్ ను పెంచుకుంటోంది. పర్సనల్ కమ్ ప్రొఫెషనల్ విషయాలను షేర్ చేసుకుంటూ నెటిజన్లతో టచ్ లో ఉంటోంది.

ఎప్పటికప్పుడు గ్లామరస్ పిక్స్ ను పోస్ట్ చేస్తూ.. కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. పొట్టి పొట్టి డ్రెస్సులు, మోడ్రన్ ఔట్ ఫిట్స్ లో అందాలు ఆరబోస్తుంటోంది. అదిరిపోయే పోజులు ఇస్తూ మైమరపిస్తుంటోంది. తన బ్యూటినెస్ తో ఫిదా చేస్తుంటోంది. ఇటీవల శారీతో సర్ప్రైజ్ ఇచ్చిన అమ్మడు.. ఇప్పుడు మరోసారి బ్లాక్ కలర్ డ్రెస్ లో స్కిన్ షోతో అదరగొట్టేసింది. కుర్చీలో కూర్చుని స్టిల్స్ ఇస్తూ మైండ్ బ్లాక్ చేస్తోంది. ఎద అందాలతో నెటిజన్లను కవ్విస్తోంది.

హెయిర్ లీవ్ చేసుకుని ఓరగా చూస్తూ అందరినీ ఫ్లాట్ చేస్తోంది పూనమ్. థైస్ షోతో కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రస్తుతం పూనమ్ కొత్త పిక్స్.. సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అమ్మడి అందానికి దాసోహమయ్యామని నెటిజన్లు చెబుతున్నారు. గ్లామర్ కు కేరాఫ్ అడ్రస్ పూనమ్ అంటూ కామెంట్స్ పెడుతూ రచ్చ రచ్చ చేస్తున్నారు. లైకుల వర్షం కురిపిస్తూ కామెంట్స్ సెక్షన్ నింపేస్తున్నారు. ఏదైనా పూనమ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్!