Begin typing your search above and press return to search.

పూనం కౌర్ గురూజీ థింగ్స్ అంటూ మరో బాంబ్..!

హీరోయిన్ గా అంతగా సక్సెస్ అవ్వకపోయినా పవన్ కళ్యాణ్ త్రివిక్రం ప్రస్తావన వస్తే తన గురించి కూడా మాట్లాడుకునేలా చేసింది పూనం కౌర్

By:  Tupaki Desk   |   5 Jan 2024 4:00 PM IST
పూనం కౌర్ గురూజీ థింగ్స్ అంటూ మరో బాంబ్..!
X

హీరోయిన్ గా అంతగా సక్సెస్ అవ్వకపోయినా పవన్ కళ్యాణ్ త్రివిక్రం ప్రస్తావన వస్తే తన గురించి కూడా మాట్లాడుకునేలా చేసింది పూనం కౌర్. పవన్, పూనం ల మధ్య ఏం జరిగింది అన్నది ఎవరికి తెలియకపోయినా ఆమె పవన్ మీద ఒక్కోసారి ప్రేమను మరోసారి ద్వేషాన్ని చూపిస్తుంది. అయితే పవన్ సంగతి అలా ఉంచితే డైరెక్టర్ త్రివిక్రం పై మాత్రం పూనం కౌర్ ఎటాక్ అందరికీ తెలిసిందే. ఆమెకు అతను చేసిన అన్యాయం ఏంటో తెలియదు కానీ టైం చూసి త్రివిక్రం కి తగిలేలా కామెంట్ చేస్తుంది పూనం కౌర్.

లేటెస్ట్ గా మరోసారి పూనం కౌర్ తన వాయిస్ వినిపించింది. త్రివిక్రం డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన గుంటూరు కారం సినిమా కథ త్రివిక్రం ఒరిజినల్ స్టోరీ కాదని.. ప్రముఖ రచయిత యద్ధనపూడి సులోచన రాణి రాసిన కీర్తి కిరీటాలు అనే నవల ఆధారంగా తెరకెక్కించాడని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ వార్తలపై పూనం కౌర్ స్పందించిన తీరు అందరిని సర్ ప్రైజ్ చేసింది.

త్రివిక్రం ని ఉద్దేశిస్తూ ఆయన ఏదైనా చేయగల సమర్ధుడు.. అంతేకాదు కొన్ని విషయాల నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా ఆయనకు బాగా తెలుసు. తప్పుడు పనులు ప్రజలకు కనపడకుండా జాగ్రత్త పడతాడు. కొందరు ఆయనను గుడ్డిగా నమ్మేస్తారని ఎక్స్ లో కామెంట్ పెట్టింది. అంతేకాదు ప్రజల సమస్యలు తీర్చలేని ప్రభుత్వం కూడా ఆయనకు బాగా సాయం చేస్తుందని అదెందుకో తనకు ఇప్పటికీ అర్థం కాదని పూనం కౌర్ వ్యంగ్యాస్త్రాలు చేసింది. ఈ ట్వీట్ కు గురూజీ థింగ్స్ అనే హ్యాష్ ట్యాగ్ జోడించి పెట్టింది పూనం కౌర్.

త్రివిక్రం మీద కోపంతోనే పూనం కౌర్ ఈ ట్వీట్ చేసిందన్న విషయం తెలుస్తున్నా అసలు అతని మీద ఈ రేంజ్ ఫైర్ అవ్వడానికి వెనుక రీజన్స్ మాత్రం ఎప్పటికీ బయట పెట్టలేదు. శ్రీకాంత్ నటించిన మాయాజాలం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పూనం కౌర్ తేజ ఒక విచిత్రం, శౌర్యం, నిక్కి అండ్ నీరజ్, శ్రీనివాస కళ్యాణం, గగనం, నెక్స్ ఏంటి, నాతిచరామి సినిమాల్లో నటించింది.