Begin typing your search above and press return to search.

పూన‌మ్ సెటైర్లు గురూజీపైనేనా?

త‌న ఎక్స్ ఖాతాలో పూన‌మ్ ఇలా రాసింది. ''నేను ఇంత‌కుముందే చెప్పాను.. మ‌ళ్లీ చెబుతున్నా.. సినీప‌రిశ్ర‌మ‌లో గురువు అనే ప‌దానికి నిలువెత్తు రూపం ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు గారు.

By:  Tupaki Desk   |   17 March 2024 6:19 AM GMT
పూన‌మ్ సెటైర్లు గురూజీపైనేనా?
X

తెలుగు సినిమా హిస్ట‌రీలో పూన‌మ్ కౌర్ త‌న‌కంటూ ఒక చిరు అధ్యాయం సృష్టించుకుంది. న‌టిగా ఆశించిన రేంజుకు చేర‌లేక‌పోయినా, త‌న‌కు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ తో ప‌ని లేకుండా కొన్నేళ్ల పాటు అవ‌కాశాలు అందుకుంది ఈ పంజాబీ భామ‌. కానీ ర‌క‌ర‌కాల పొలిటిక‌ల్ స్టంట్స్‌కి సంబంధించిన‌ ఎపిసోడ్స్, విచ్చ‌ల‌విడి సోష‌ల్ మీడియా పూన‌మ్ పేరును నిరంత‌రం హెడ్ లైన్స్ లో నిలిచేలా చేసాయి.

అదంతా అటుంచితే ఇప్పుడు ఇండ‌స్ట్రీ గురువు అంటే దాస‌రి మాత్ర‌మే! అంటూ ప్ర‌ముఖ టాలీవుడ్ ద‌ర్శ‌కుడిపై సెటైర్ వేసింది. త‌న ఎక్స్ ఖాతాలో పూన‌మ్ ఇలా రాసింది. ''నేను ఇంత‌కుముందే చెప్పాను.. మ‌ళ్లీ చెబుతున్నా.. సినీప‌రిశ్ర‌మ‌లో గురువు అనే ప‌దానికి నిలువెత్తు రూపం ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు గారు. ప్ర‌తిభ‌తో ఆయ‌న ఈ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇత‌రుల స్క్రిప్టులు హైజాక్ చేసిన‌ట్టు ఈ పేరును హైజాక్ చేయ‌లేరు'' అంటూ సెటైర్ వేసింది. ఈ వ్యాఖ్యానంతో పాటు దాస‌రితో తాను దిగిన ఓ ఫోటోను కూడా షేర్ చేయ‌డంతో అది వైర‌ల్ గా మారింది.

అయితే గురూజీ అంటూ ప్ర‌స్థావించింది కాబ‌ట్టి ఈ సెటైర్ త్రివిక్ర‌మ్ పైనే అంటూ కొంద‌రు గెస్ చేస్తున్నారు. ఏదేమైనా ప్ర‌స్తుత పొలిటిక‌ల్ స్టంట్ లో జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ స్నేహితుడైన త్రివిక్ర‌మ్ ని కెలుకుతూ మ‌రోసారి కార్చిచ్చుకు ఆజ్యం పోసింద‌ని నెటిజ‌నులు వ్యాఖ్యానిస్తున్నారు.

నిద్ర‌లేమి స‌మ‌స్య‌?

వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను ఎంత‌మాత్రం దాచుకోని పూన‌మ్ గ‌తంలో త‌న స‌మ‌స్య‌ల గురించి ఏక‌రువు పెట్టింది. ఈ భామ త‌న‌కు ఊహించ‌ని అనారోగ్య స‌మ‌స్య‌లున్నాయ‌ని ఇంత‌కుముందు వెల్ల‌డించింది. ఆ త‌ర్వాత త‌న‌లోని ఆధ్యాత్మిక చింత‌న గురించి ఓపెనైంది. అప్పుడ‌ప్పుడు సోష‌ల్ మీడియాల్లో కొంద‌రిపై సెటైర్లు వేసే ఈ భామ త‌న‌కు క‌ల‌త నిద్ర స‌మ‌స్య దాంతో ఉత్ప‌న్న‌మ‌య్యే తీవ్ర‌ మ‌తిమ‌రుపు స‌మ‌స్య‌ ఉంద‌ని కూడా వెల్ల‌డించింది.