పూనమ్ ఆకస్మిక మరణంపై షాకింగ్ కామెంట్
దిగ్భ్రాంతికరమైన సంఘటనలలో నటి పూనమ్ పాండే మరణించినట్లు ఆమె మేనేజర్ ధృవీకరించిన వార్త షాక్ కి గురి చేసింది
By: Tupaki Desk | 3 Feb 2024 3:52 AM GMTదిగ్భ్రాంతికరమైన సంఘటనలలో నటి పూనమ్ పాండే మరణించినట్లు ఆమె మేనేజర్ ధృవీకరించిన వార్త షాక్ కి గురి చేసింది. ఫిబ్రవరి 2, శుక్రవారం ఉదయం తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన పోస్ట్‌లో పూనమ్ మరణ వార్తను వెల్లడిస్తూ సదరు నటి గర్భాశయ క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్)తో మరణించిందని పేర్కొన్నారు. ఆమె మరణం తరువాత రియాలిటీ టీవీ స్టార్, నటి సంభవ సేథ్ షాకింగ్ కామెంట్ చేసారు. పూనమ్‌కు క్యాన్సర్ ఉన్న విషయం తనకు తెలియదని అన్నారు.
పూనమ్‌తో కలిసి ఒక టెలివిజన్ షోలో కనిపించిన సంభవ సేథ్ ఆమె గురించి చాలా బయటికి తెలియని విషయాలు తెలిపారు. ''ఓ మై గాడ్! ఆమె నాకు బాగా తెలుసు. మేం కలిసి ఖత్రోన్ కే ఖిలాడీ చేసాము. నేను ఆమెను గత సంవత్సరం కలిశాను. నిజానికి కొన్నిసార్లు సామాజికంగా లేదా ఏదైనా కార్యక్రమంలో కలుసుకుంటూ ఉంటాము. అయితే తాను ఇలాంటి సమస్యతో సతమతమవుతున్నానని ఎప్పుడూ చెప్పలేదు. ఇది పూర్తిగా నమ్మశక్యం కానిది.. నేను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను'' అని అన్నారు. పూనమ్‌ది చాలా చిన్న వయసు.. 30-32 సంవత్సరాలు ఉంటాయి. జీవితం చాలా అనూహ్యమైనది. నేను ముంబైలో లేను.. కానీ నివాళులు అర్పించడానికి అక్కడ ఉండాలనుకుంటున్నాను. నేను వెంటనే ముంబై చేరుకుంటాను''అని అన్నారు.
పూనమ్ తన వ్యక్తిత్వానికి విరుద్ధంగా ఎలా ప్రవర్తించాల్సి వచ్చిందో కూడా ఆమె తెలిపారు. ''నాకు పూనమ్ గురించి బాగా తెలుసు.. తను చాలా సానుకూలమైన వ్యక్తి. తనకు పెంపుడు కుక్క ఉందనేది నాకు గుర్తుంది. ఆమె చాలా హ్యాపీ-గో-లక్కీ పర్సన్. ప్రతి ఒక్కరూ మీడియా దృష్టిలో పడటం కోసం కొన్ని చేస్తుంటారు. కొన్నిసార్లు ఆమె కూడా చేసింది.. కానీ తను అలాంటి వ్యక్తిత్వం కానే కాదు'' అని టాప్ సీక్రెట్ ని రివీల్ చేసింది.
అనారోగ్యం గురించి పూనమ్ ఎప్పుడూ తనతో మాట్లాడకపోవడం మరింత పెద్ద షాక్ నిచ్చిందని సంభావన అన్నారు. పూనమ్ దీని గురించి ఏమీ చెప్పలేదు. ఆమె ఎంత బలంగా ఉందో చూడండి.. ఏ వేదికపైనా ఎప్పుడూ క్యాన్సర్ గురించి ప్రస్తావించలేదు. ఆమె ఎక్కడ ఉన్నా సంతోషంగా క్షేమంగా ఉండాలని అనకున్నాను... అని అన్నారు. ''క్యాన్సర్‌తో వచ్చే బాధ చాలా కఠినమైనది. దానిని ఎదుర్కోవడానికి వైద్యపరమైన సౌకర్యాలు ఉన్నాయని మనందరికీ తెలుసు.. కానీ ఆమె చాలా కష్టతరమైన దశలో ఉండి ఉంటుంది''అని వ్యాఖ్యానించింది. క్యాన్సర్ తో బాధపడుతూ కూడా తను ఎవరికీ ఏదీ చెప్పలేదు.. చివరివరకూ ఎంతో ధైర్యంగా ఉంది అని అన్నారు.