పూనమ్ పాండే సహా అందర్నీ అండమాన్ జైల్లో పెట్టాలి!
పూనమ్ పాండే మరణవార్త ఎంత సంచలనమైందో తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా అభిమానులంతా నివాళులు అర్పించారు
By: Tupaki Desk | 3 Feb 2024 10:45 AM GMTపూనమ్ పాండే మరణవార్త ఎంత సంచలనమైందో తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా అభిమానులంతా నివాళులు అర్పించారు. కన్నీటి పర్యంతం అయ్యారు. చిన్న వయసులోనే క్యాన్సర్ తో చనిపోవడం ఏంటి? అని అంతా ఎంతో బాధపడ్డారు. ఇక పూనమ్ మన మధ్యన లేదంటూ అన్ని మీడియా సంస్థలు అధికారి కంగా ప్రకటించాయి. పూనమ్ పాండే మేనజర్ కూడా చనిపోయిందని వెల్లడించడంతోనే విషయం అధికారికమైంది.
దీంతో నిన్నంతా సోషల్ మీడియా సహా అన్ని చోట్లా ఇదే చర్చనీయాంశంగా మారింది. కానీ తాజాగా నేడు `నేను బ్రతికే ఉన్నాను` అంటూ పూనమ్ పాండే ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. సర్వైకల్ క్యాన్సర్ కాదు కాదా... నాకు ఎలాంటి క్యాన్సర్ జబ్బు లేదని తెలిపింది. అయితే తాను చనిపోయినట్లు వచ్చిన ప్రచారమంతా ఓ పబ్లిసిటీ స్టంట్ అని తేల్చేసింది. ఇది కేవలం గర్భాశయ క్యాన్సర్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్న మహళల పట్ల చేసిన ఓ అవేర్ నెస్ కార్యక్రమం అని తెలిపింది.
దీంతో పూనమ్ పాండేపై నిన్నటి రోజున సంతాపం తెలిపిన వారంతా ఆగ్రహంతో ఊగిపోతున్నారు. క్యాన్స ర్ తో చనిపోయాను అని చెప్పుకోవడం అవేర్ నెస్ కార్యక్రమమా? అసలు ఇలాంటి ఐడియా ఎవరిచ్చారు? ఆ కాన్సెప్ట్ హీరో ఎవరో? ఓ సారి చూపించండి అంటూ నెటి జనులు అడుగుతున్నారు. తాను చనిపోక పోయినా పూనమ్ చేసిన పనికి అభిమానులు..వాళ్ల నమ్మకాన్ని...ప్రేమని..ఆదరణని అన్నింటిని చంపేసిందని అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి వాళ్లను అండమాన్ జైలుకి తరలించి ఓ రెండు రోజులు చీకటి గదిలే వేస్తే బుద్ది వస్తుందని మండిపడుతున్నారు. క్యాన్సర్ పై అవగాహన కల్పించాలంటే ఇంతకు మించి వినూత్నమైన ఐడియా లేదని ఇలాంటి చౌకబారు కాన్సెప్ట్ తో ముందుకొచ్చారా? అంటూ నిప్పులు చెరుగుతున్నారు. పూనమ్ తో సహ తనకు సహకరించిన మేనేజర్..ఇతర సిబ్బందిన అందరిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.