Begin typing your search above and press return to search.

బికినీలో పూనమ్ సర్ ప్రైజ్.. అంతకుమించి..

అయినప్పటికీ, కొన్ని చిన్న సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని సాధించలేదు.

By:  Tupaki Desk   |   24 May 2024 1:58 PM GMT
బికినీలో పూనమ్ సర్ ప్రైజ్.. అంతకుమించి..
X

పూనమ్ బాజ్వా సోషల్ మీడియాలో గ్లామరస్ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేక క్రేజ్ అందుకుంది. మొదట మోడల్ గా ప్రారంభమైన ఆమె ప్రయాణం అతి తక్కువ కాలంలోనే తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా అవకాశాలు అందుకుంది. మొదట్లో ఈ బ్యూటీ భాషతో సంబంధం లేకుండా సౌత్ ఇండస్ట్రీలో బిజీగా కనిపించింది. అయినప్పటికీ, కొన్ని చిన్న సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని సాధించలేదు.


తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో వరుస అవకాశాలు వచ్చినప్పటికీ, పూనమ్ హీరోయిన్ గా బిగ్ హిట్ అందుకోవడంలో విఫలమైంది. ఆమె తొలి చిత్రం 'మొదటి సినిమా' తో కెరీర్ మొదలు పెట్టిన పూనమ్, ఆ తర్వాత నాగార్జున బాస్ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. కానీ అవి పెద్ద విజయాలను నమోదు చేయకపోవడంతో, ఆమెకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. 'పరుగు' సినిమాలో హీరోయిన్ సిస్టర్ పాత్రలో కనిపించి, ప్రేక్షకులను ఆకట్టుకుంది.

తరువాత కాలంలో పూనమ్ ఎక్కువగా సపోర్టింగ్ రోల్స్ లో కనిపిస్తూ వచ్చింది. కన్నడ చిత్ర పరిశ్రమలో మాత్రం కొంత కాలం పాటు హీరోయిన్ గా మంచి అవకాశాలు దక్కాయి. ఆ సమయంలో ఆర్థికంగా స్థిరపడింది. మలయాళం ఇండస్ట్రీలో కూడా కొన్ని చిత్రాలలో నటించిన పూనమ్, తెలుగులో 'పరుగు' తర్వాత పెద్దగా కనిపించలేదు.

సమయానుకూలంగా వివిధ భాషల్లో నటిస్తూ వస్తున్న పూనమ్, సోషల్ మీడియాలో మాత్రం తన గ్లామర్ షో తో ఓ వర్గం వారిని ఆకట్టుకుంటోంది. రీసెంట్ గా పూనమ్ నడుము, ఏద అందాలు హైలైట్ అయ్యేలా బికినీ డ్రెస్ లో స్టిల్స్ ఇచ్చింది. స్విమ్మింగ్ పూల్ లో నిలబడి ఉన్న ఆమె తన నవ్వుతోనే కుర్రాళ్ళ మనసును దోచేసింది. నాలుగు పదుల వయసు దగ్గర పడుతున్న కూడా అమ్మడు పాతికేళ్ల అమ్మాయి తరహాలో మెరిసిపోతోందని ఫాలోవర్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.

తన గ్లామర్ షో తో పూనం బాగా ఆకట్టుకుంటున్నప్పటికీ, అందుకు తగ్గట్టుగా ఆఫర్లు రాలేదు. అయితే భవిష్యత్తులో స్పెషల్ సాంగ్స్ తో లేదా ఇతర ప్రాజెక్టులతో క్రేజ్ అందుకోవాలని ఆశిస్తోంది. పూనమ్ నటనా ప్రస్థానంలో మరిన్ని ఆఫర్స్ అందుకోవాలి అని ఆమె ఫాలోవర్స్ ఎదురుచూస్తున్నారు.