100 ఏళ్లకు 100 కోట్లు సంపాదించా!
నెగిటివ్ రోల్ అయినా...పాజిటివ్ రోల్ అయినా తనదైన మార్క్ పెర్పార్మెన్స్ తో ఆకట్టుకోవడం పోసాని ప్రత్యేకత.
By: Tupaki Desk | 7 May 2024 11:30 AM GMTరచయిత..నటుడు..దర్శకుడు పోసాని కృష్ణ మురళి కెరీర్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. పోసాని మల్టీ ట్యాలెంటెడ్ పర్సనాల్టీ. అందులోనూ నటుడిగా ఆయనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగల నటుడు. నెగిటివ్ రోల్ అయినా...పాజిటివ్ రోల్ అయినా తనదైన మార్క్ పెర్పార్మెన్స్ తో ఆకట్టుకోవడం పోసాని ప్రత్యేకత. నటుడిగా తనకంటూ ఓ శైలిని..ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న నటుడు.
ఇండస్ట్రీకి రైటర్ గా వచ్చి నటుడిగా సక్సెస్ అయ్యారు. ఇండస్ట్రీ నుంచి ఆయనకు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ కూడా లేదు. ఇక వ్యక్తిగతంగా పోసాని ఓపెన్ మైండెడ్ అని చెప్పాల్సిన పనిలేదు. తాజాగా తన ఆస్తుల గురించి కూడా పోసాని ఓపెన్ అయ్యారు. 'ప్రస్తుతం ఎలాంటి చీకుచింత లేకుండా జీవిస్తున్నానన్నారు. వస్తే సినిమాలు చేయడం లేదంటే? ఇంట్లో ఉండటం తప్ప మరే వ్యాపకం పెట్టుకోనన్నారు. మందు..సిగరెట్టు...పబ్ లకు వెళ్లడం...పార్టీలకు వెళ్లే అలవాట్లు లేవన్నారు.
సాధారణంగా సినిమా వాళ్లు అంటే వీటికి వెళ్తురంటారు. కానీ నేను ఆ టైప్ కాదు. ఉంట్లో సెట్లో..లేదంటే ఇంట్లో. ఆర్దికపరంగా ఎలాంటి కష్టాలు లేవు. నాతరంతో పాటు తర్వాత తరం కూడా బ్రతికేసే అంత ఆస్తి సంపాదించా. వంద కోట్లు సంపాదించా. అప్పులు లేవు.. లోన్స్ లేవు. ఇవి రెండు లేకపోతే మనిషికి ఏ టెన్షన్ ఉండదు. అందుకే నేను ప్రశాంతగా ఉండగల్గుతున్నా. నా భార్య నన్ను ఎంతో బాగా అర్దం చేసుకుంటుంది. చిన్న పిల్లడిలాగే చూసుకుంటుంది. అలాంటి భార్య దొరికినందుకు అదృష్టవంతుడిని.
నాకు ఇద్దరు కొడులకు. పెద్దాబ్బాయి హాకాంగ్ లో ఫిల్మ్ కి సంబంధించి అన్ని రకాల కోర్సులు కూడా చేసాడు. హైదరాబాద్ వచ్చి సినిమాలు చేయాలనుకున్నాడు. ఓ ప్రయత్నం కూడా చేసాడు. కాకపోతే తను సినిమాలు చేయాలంటే అవతలి వారు బాగా నచ్చాలి. లేకపోతే చేయడు. తన పాలసీ అది. దానికి నేను కూడా అడ్డు చెప్పలేదు చాలా తెలివైన వాడు. కథ..మాటలు అన్ని తానే రాసేస్తాడు. నేను చేస్తున్న చాలా సినిమాలకు తన రచన చేస్తుంటాడు.