నాని నమ్మిన కోర్ట్.. న్యాయం జరిగిందా?
నాని మాటలు అక్షరాలా నిజమయ్యాయి. ఈ సినిమాకు మేకర్స్ ముందుగా మీడియా ప్రీమియర్ షోను రెండు రోజుల ముందే ప్రదర్శించడం జరిగింది.
By: Tupaki Desk | 13 March 2025 11:27 AM ISTనేచురల్ స్టార్ నాని మరోసారి తన కథా దృష్టిని నిరూపించుకునేలా ఉన్నాడు. కంటెంట్ బేస్డ్ సినిమాలకు సపోర్ట్ చేయడంలో ఎప్పుడూ ముందుండే నాని, ఈసారి 'కోర్ట్' అనే వినూత్నమైన సినిమాను ప్రేక్షకులకు అందిస్తున్నాడు. ఈ చిత్రం ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజీ ప్రధాన పాత్రల్లో రూపొందింది. దీప్తి గంట, ప్రశాంతి త్రిపిరినేని నిర్మాణంలో, రామ్ జగదీష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 14న థియేటర్లలో విడుదల కానుంది.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నాని చేసిన వ్యాఖ్యలు అందర్నీ ఆశ్చర్యపరిచాయి. "ఈ సినిమా గురించి వేరే ప్రమోషన్ ఏమీ చేయనవసరం లేదు. ఇది ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుంది. ఒక మంచి సినిమాను చూడాలనే వారి కోరికను తీర్చగలదు" అంటూ నాని ప్రకటించాడు. అంతే కాకుండా, "ఈ సినిమా నచ్చకపోతే, నా హిట్ 3 సినిమాను చూడక్కర్లేదు" అనే మాటలతో తన నమ్మకాన్ని స్పష్టంగా చూపించాడు. సినిమా కథ ప్రధానంగా పొక్సో చట్టం ఆధారంగా సాగుతుందనగానే, సినిమా కొత్తదనం ఏమిటనేది మరింత ఆసక్తిగా మారింది.
నాని మాటలు అక్షరాలా నిజమయ్యాయి. ఈ సినిమాకు మేకర్స్ ముందుగా మీడియా ప్రీమియర్ షోను రెండు రోజుల ముందే ప్రదర్శించడం జరిగింది. ఫలితంగా, సినిమా చూసిన మీడియా విశ్లేషకులు, ఫిల్మ్ ఫ్రటర్నిటీ అందరూ 'కోర్ట్' గురించి మెచ్చుకుంటూ ట్వీట్లు చేయడం మొదలుపెట్టారు. సినిమా కథనం, పాత్రల రాసిన విధానం, ప్రతి సన్నివేశం ఎంతో బలంగా ఉండడం, ముఖ్యంగా శివాజీ నటన పట్ల భారీగా ప్రశంసలు వినిపిస్తున్నాయి.
దర్శకుడు రామ్ జగదీష్ వినూత్నమైన టేకింగ్‌తో ఈ సినిమాను మలచిన విధానం, పాత్రల డెప్త్, హృదయాన్ని తాకే డైలాగులు ప్రేక్షకులపై భారీ ఇంపాక్ట్ కలిగించబోతున్నాయనే మాట వినిపిస్తోంది. కోర్ట్ సినిమా కేవలం ఒక కేసును చూపించేందుకు మాత్రమే కాకుండా, దానితో వచ్చిన ఎమోషన్‌ను, మనుషుల జీవితాలపై పడే ప్రభావాన్ని అద్భుతంగా తెరపై చూపించిందని విశ్లేషకులు అంటున్నారు.
తన సినిమా కోసం కృత్రిమ హైప్ క్రియేట్ చేయకుండా, నిజాయితీగా నాణ్యమైన సినిమా అందించాలనే ఉద్దేశంతో నాని ముందుకొచ్చాడు. ఇప్పుడీ సినిమా చూసిన వారంతా "నాని చేసిన ప్రమోషన్ ఎంత నిజాయితీగా ఉందో సినిమా చూస్తే తెలుస్తోంది" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమా ఓపెనింగ్స్ మరింత బలంగా రావాలని భావించిన టీమ్, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో భారీగా పేమ్ ప్రీమియర్లు ప్లాన్ చేస్తోంది.
ఓపెనింగ్ వసూళ్లు ఎలా ఉన్నా, నాని నమ్మిన కథ ఎంతవరకు న్యాయం చేసిందో త్వరలో ప్రేక్షకుల స్పందనతో తెలుస్తుంది. కానీ ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు, కోర్ట్ మరో కంటెంట్ బేస్డ్ క్లాసిక్‌గా నిలిచే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. ఈ సినిమా విజయం సాధిస్తే, భవిష్యత్తులో మరిన్ని గొప్ప కథలను తెలుగు సినిమా పరిశ్రమలో చూడగలమనే ఆశక్తిని కలిగిస్తోంది.