ఫ్యాన్స్ వల్ల అరుదైన వ్యాధికి గురైన సిద్ధార్థ్!
కొంతమందికి ఆ క్రేజ్ తక్కువ కాలంలోనే వస్తే, మరికొంత మందికి మాత్రం ఎంత ప్రయత్నించినా అందని ద్రాక్ష లాగే మిగిలి పోతుంటుంది.
By: Tupaki Desk | 7 Feb 2025 12:30 AM GMTఎప్పుడూ ఏదో కాంట్రవర్సీ కామెంట్స్ తో నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటాడు హీరో సిద్ధార్థ్. ఇండస్ట్రీలోకి వచ్చిన ఎవరైనా సరే మంచి ఫేమ్, క్రేజ్, ఫాలోయింగ్, గుర్తింపు కోసం పరితపిస్తుంటారు. కొంతమందికి ఆ క్రేజ్ తక్కువ కాలంలోనే వస్తే, మరికొంత మందికి మాత్రం ఎంత ప్రయత్నించినా అందని ద్రాక్ష లాగే మిగిలి పోతుంటుంది.
ఎవరికైనా క్రేజ్ వచ్చాక దాన్ని ఎంజాయ్ చేయడం మామూలే. కానీ ఆ ఫాలోయింగ్ వల్ల తనకు పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అనే వ్యాధి వచ్చిందని సిద్ధార్థ్ ఆశ్చర్యకర కామెంట్స్ చేశాడు. ఈ వ్యాధి వల్ల తానెంతో ఇబ్బంది పడ్డానని, ఆ సమస్య నుంచి కోలుకోవడానికి తనకు ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాలు పట్టిందని సిద్ధార్థ్ వెల్లడించాడు.
స్టార్ స్టేటస్ అందుకోవడానికి ఎంతో కష్టపడ్డానని చెప్పిన సిద్ధార్థ్ ఆ స్టేటస్ వచ్చాక ఆడియన్స్ వచ్చి తనతో మాట్లాడితే తెగ టెన్షన్ పడిపోయేవాడినని, నా స్టార్‌డమ్ ని నేనసలు ఎంజాయ్ చేయలేదని సిద్ధార్థ్ ఈ సందర్భంగా తెలిపాడు. అంత స్టార్‌డమ్ వచ్చినందుకు అందరికీ థాంక్‌ఫుల్ గా ఉండాలని అందరూ అనొచ్చు కానీ తన మానసిక పరిస్థితి అప్పుడు వేరేలా ఉందని సిద్ధార్థ్ ఈ సందర్భంగా వెల్లడించాడు.
వాస్తవానికి స్టార్‌డమ్ వచ్చినప్పుడు ఎన్ని ఉన్నా అవన్నీ మర్చిపోయి కృతజ్ఞతగా ఉండాలని, తాను థాంక్ ఫుల్ గా ఉన్నప్పటికీ జనాల అటెన్షన్ తనకు అలవాటవడానికి చాలా టైమ్ పట్టిందని తనని తాను సమర్థించుకున్నాడు సిద్ధూ. అయితే తన భార్య అదితి రావు మాత్రం తనలా కాదని, చాలా డిఫరెంట్ గా ఉంటుందని ఆయన తెలిపాడు.
అదితి స్పాట్ లైట్ లో ఉండటాన్ని చాలా ఎంజాయ్ చేస్తుందని చెప్పాడు. దీనిపై అదితి మాట్లాడుతూ, సిద్ధూ అటెన్షన్ ను ద్వేషిస్తాడని, కానీ తాను మాత్రం అటెన్షన్ ను చాలా ఇష్టపడతానని, ఎవరైనా మనల్ని ప్రేమించడం మన అదృష్టమని దాన్ని ఎంజాయ్ చేయలేకపోవడం బాధాకరమన్నట్టు అదితి తెలిపింది.