Begin typing your search above and press return to search.

ఈ వారం 'పొట్టేల్'కు గట్టి పోటీనిచ్చేదెవరు?

దసరా సీజన్ అయిపోయింది.. దీపావళి సినిమాల సందడి మొదలు కాబోతోంది. అంతకంటే ఒక వారం ముందుగా అనేక చిన్న చిత్రాలు విడుదల కాబోతున్నాయి

By:  Tupaki Desk   |   20 Oct 2024 1:59 PM GMT
ఈ వారం పొట్టేల్కు గట్టి పోటీనిచ్చేదెవరు?
X

దసరా సీజన్ అయిపోయింది.. దీపావళి సినిమాల సందడి మొదలు కాబోతోంది. అంతకంటే ఒక వారం ముందుగా అనేక చిన్న చిత్రాలు విడుదల కాబోతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు, ఏడు సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు థియేటర్లలోకి వస్తున్నాయి. ఇవన్నీ చిన్న సినిమాలే అయినా, వాటిల్లో కొన్ని మూవీస్ ప్రమోషనల్ కంటెంట్ తో జనాల దృష్టిని ఆకర్షించాయి. ఈ శుక్రవారం విడుదలయ్యే ఆ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.

తెలుగమ్మాయి అనన్య నాగళ్ల, యువ చంద్ర కృష్ణ, అజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ''పొట్టేల్''. ‘సవారీ’ ఫేమ్ సాహిత్ మోత్కూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాని అక్టోబర్ 25న విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ యునిక్ ప్రమోషన్స్ తో బజ్ క్రియేట్ చేసారు. ఆల్రెడీ రిలీజైన టీజర్, సాంగ్స్, ట్రైలర్ కు ఆడియన్స్ నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. హార్డ్ హిట్టింగ్ కంటెంట్ తో రాబోతున్నట్లు శాంపిల్ గా చూపించారు. మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

ఈ వారం రిలీజ్ అవుతోన్న మరో చిన్న సినిమా ‘నరుడి బ్రతుకు నటన’. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో రాబోతున్న ఈ చిత్రం కావడంతో, జనాలు దృష్టి సారించారు. ట్రైలర్ కూడా బాగానే ఉంది. శివ కుమార్, నితిన్ ప్రసన్న, శృతి జయన్, ఐశ్వర్యా అనిల్ కుమార్, వైవా రాఘవ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకి రిషికేశ్వర్ యోగి దర్శకత్వం వహించారు. ఇప్పటికే ప‌లు ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్స్‌లో ఈ సినిమా స్పెషల్ గా స్క్రీనింగ్ చేయబడినట్లు తెలుస్తోంది.

డిఫరెంట్ ప్రమోషన్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన చిన్న సినిమా "లగ్గం". రమేశ్ చెప్పాల దీనికి దర్శకుడు. ఇందులో సాయి రోనక్, ప్రగ్యా నగ్రా, రాజేంద్రప్రసాద్, రోహిణి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మధ్యనే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ బాగానే వుంది. సినిమాని ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. దీంతో పాటుగా 'రోటీ కపడా రొమాన్స్', C.202, 'సముద్రుడు', 'ఎంత పని చేసావ్ చంటి' వంటి మరో నాలుగు చిన్నా చితక చిత్రాలు థియేటర్లలోకి వస్తున్నాయి.

ఇటీవల కాలంలో ఏ సినిమాకైనా మౌత్ టాక్ అనేది ముఖ్యం. కంటెంట్ బాగుందని టాక్ బయటకు వస్తే, జనాలకు చిన్న సినిమాలను కూడా థియేటర్లకు వెళ్లి చూస్తున్నారు. ఇప్పటికైతే ఈ వారం రిలీజయ్యే అర డజను చిత్రాల్లో 'పొట్టేల్' మూవీకి మంచి బజ్ వుంది. 'నరుడి బ్రతుకు నటన', 'లగ్గం' చిత్రాలు ట్రెయిలర్స్ తో అకట్టుకున్నాయి. మరి వీటిల్లో ఏవేవి ప్రేక్షకాదరణ పొందుతాయో చూడాలి.