Begin typing your search above and press return to search.

పర్ఫెక్ట్ ప్లాన్ తో పొట్టెల్.. రిలీజ్ ఎప్పుడంటే..

దీపావళి సెలవు దినం (అక్టోబర్ 29) సమయానికి సినిమా కలెక్షన్లకు పెద్ద లాభాన్ని తీసుకురావొచ్చని చిత్ర యూనిట్ భావిస్తోంది.

By:  Tupaki Desk   |   7 Oct 2024 5:19 AM GMT
పర్ఫెక్ట్ ప్లాన్ తో పొట్టెల్.. రిలీజ్ ఎప్పుడంటే..
X

గ్రామీణ నేపథ్యంతో రూపొందిన యాక్షన్ డ్రామా 'పొట్టెల్' అక్టోబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. యువ నటుడు యువ చంద్ర కృష్ణ, టాలెంటెడ్ నటి అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, డైరెక్టర్ సాహిత్ మోత్కూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా విడుదలైన పోస్టర్, టీజర్ ఈ సినిమాపై మంచి అంచనాలు పెంచుతున్నాయి.

ఈ సినిమాను నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మాణ సంస్థకు చెందిన నిషాంక్ రెడ్డి కుడితి, ప్రగ్యా సన్నిధి క్రియేషన్స్‌ నుంచి సురేష్ కుమార్ సాదిగే సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమాలో సీనియర్ నటుడు అజయ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన అజయ్ ఫస్ట్ లుక్ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఇదే క్రమంలో యాక్షన్‌తో కూడిన గడ్డా కథ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కూడా ఆడియన్స్ లో హైప్ క్రియేట్ చేస్తున్నాయి.

ముఖ్యంగా ఈ సినిమా విడుదల తేదీ పోస్టర్ చూస్తే ఒక సీరియస్ ఏమోషన్ కనిపిస్తోంది, ప్రధాన పాత్రలైన యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల దంపతులు, వారి కూతురు, గ్రామస్థులు వివాదంలో ఉన్నట్లు అర్ధమవుతుంది. ఇక ఈ సినిమా అక్టోబర్ 25న విడుదల అవుతుండదం విశేషం. దీపావళి సెలవు దినం (అక్టోబర్ 29) సమయానికి సినిమా కలెక్షన్లకు పెద్ద లాభాన్ని తీసుకురావొచ్చని చిత్ర యూనిట్ భావిస్తోంది.

ఈ చిత్రానికి సంబంధించిన సౌండ్‌ట్రాక్ ఇప్పటికే సూపర్ హిట్ అవ్వగా, విడుదలైన అన్ని పాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రత్యేకంగా పాటలు ఒక్కోటి ప్రత్యేకతను సొంతం చేసుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. టీజర్‌ కూడా మంచి స్పందనను సొంతం చేసుకుంది.

సినిమాటోగ్రఫీ బాధ్యతలు మోనిష్ భూపతి రాజు నిర్వహించగా, ఎడిటర్‌గా కార్తీక శ్రీనివాస్, ఆర్ట్ డైరెక్టర్‌గా నార్ని శ్రీనివాస్ వ్యవహరించారు. సినిమా గ్రామీణ నేపథ్యంతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చేలా దర్శకుడు సాహిత్ మోత్కూరి కధను అల్లారు. ముఖ్యంగా గ్రామాల్లోని సామాజిక అంశాలు, కుటుంబ బంధాలు, ప్రతీకార భావనలకు పెద్దపీట వేశాడు.

'పొట్టెల్' కథలో యాక్షన్ అంశాలు ప్రధానంగా ఉంటాయి. గ్రామ స్థాయి కథతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను హత్తుకోవడానికి అన్ని అంశాలను కలిగి ఉందట. ప్రధానంగా ఈ కథలోని ఎమోషనల్ డీప్ నెస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఉండబోతుంది. గ్రామీణ కథ, ఇంటెన్స్ యాక్షన్, బలమైన ఎమోషన్స్ ఈ సినిమాను ప్రేక్షకులకు మరింత దగ్గర చేస్తాయనే నమ్మకంతో దర్శకుడు చిత్రాన్ని తెరకెక్కించారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.