Begin typing your search above and press return to search.

సవారి దర్శకుడి 'పొట్టేల్'.. డిఫరెంట్ మోషన్ పోస్టర్!

ఈ మధ్యకాలంలో గ్రామీణ నేపథ్యంలో వస్తున్న సినిమాలు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ అందుకుంటున్నాయి

By:  Tupaki Desk   |   28 Dec 2023 6:14 AM GMT
సవారి దర్శకుడి పొట్టేల్.. డిఫరెంట్ మోషన్ పోస్టర్!
X

ఈ మధ్యకాలంలో గ్రామీణ నేపథ్యంలో వస్తున్న సినిమాలు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ అందుకుంటున్నాయి. మంచి కంటెంట్ తో పాటు ఎమోషన్స్ ఉంటే బాక్సాఫీస్ వద్ద ఆ సినిమాలకు కలెక్షన్ల వర్షం కురుస్తుంది. ఇప్పటికే మల్లేశం, బలగం లాంటి సినిమాలు దాన్ని నిరూపించింది. అలాంటి కోవలోనే ఇప్పుడు మరో సినిమా రాబోతోంది. ఆ సినిమా పేరే 'పొట్టేల్'.


సవారి సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సాహిత్ మోత్కూరి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ళ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. తాజాగా టైటిల్ మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మోషన్ పోస్టర్ సినిమాపై ఒక్కసారిగా ఆసక్తిని పెంచేసింది. టైటిల్ కి తగ్గట్టే ఈ మోషన్ పోస్టర్ ఉంది. అంతేకాకుండా బోనాల పండుగను గుర్తు చేసే విధంగా ఈ మోషన్ పోస్టర్ని డిజైన్ చేశారు.

అమ్మవారి ముందు పొట్టేలు సాంప్రదాయకంగా అలరించి బలిచ్చే ముందు భోగినీలు పాడే లయబద్ధమైన పాటతో గూజ్ బంప్స్ వచ్చేలా ఉన్న మోషన్ టీజర్ ఆధ్యంతం ఆకట్టుకుంది. తెలంగాణ ప్రాంతంలోని ఆచారాలు ఈ సినిమా చూపించబోతున్నాను. తాజాగా విడుదల చేసిన మోషన్ టీజర్ లో శేఖర్ చంద్ర మ్యూజిక్ మెయిన్ హైలెట్ అనే చెప్పాలి.

ఎన్ ఐ ఏ ఎంటర్టైన్మెంట్స్ నిశాంత్ రెడ్డి, కుడికి ప్రగ్యా సన్నిధి క్రియేషన్స్ సురేష్ కుమార్ సడిగే సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అజయ్, తన శ్రీ, ప్రియాంక శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, చత్రపతి శేఖర్, జీవన్, విక్రమ్, రియాజ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టిన ఈ చిత్రానికి మల్లేష్ భూపతిరాజు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.నార్ని శ్రీనివాస్ ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు.

ఇక పొట్టేల్ సినిమా డైరెక్టర్ సాహిత్ మోత్కూరి విషయానికొస్తే.. 'బంధం' అనే ఇండిపెండెన్స్ సినిమాతో దర్శకుడుగా మారిన ఇతను నందుతో 'సవారి' అనే సినిమాని తెరకెక్కించాడు. కమర్షియల్ గా ఈ సినిమా సక్సెస్ కాకపోయినా మంచి కంటెంట్ తో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఒక సవారి తర్వాత మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో 'పొట్టేల్' సినిమాని తెరకెక్కించారు. మోషన్ పోస్టర్ ని బట్టి ఈ సినిమాలో మంచి కంటెంట్ ఉంటుందని అర్థమవుతుంది. సినిమాకు సంబంధించిన మిగతా వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు మేకర్స్.