Begin typing your search above and press return to search.

పొట్టేల్.. రెస్పాన్స్ అదిరింది!

అదే జోష్ తో ఇటీవల ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. బ్లాక్‌ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చేతుల మీదుగా విడుదల చేశారు.

By:  Tupaki Desk   |   20 April 2024 6:40 AM GMT
పొట్టేల్.. రెస్పాన్స్ అదిరింది!
X

బ్యూటిఫుల్ అనన్య నాగళ్ల, యువ చంద్ర కృష్ణ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న మూవీ పొట్టేల్. డైరెక్టర్ సాహిత్ మోత్కురి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. గీతా మాధురి భర్త నందు హీరోగా సవారీ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఇప్పుడు మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

అదే జోష్ తో ఇటీవల ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. బ్లాక్‌ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ టీజర్ చాలా రా అండ్ రస్టిక్ గా ఉంది. ఓ పల్లెటూరులో జరిగే కథే సినిమా అని టీజర్ ద్వారా అర్థమవుతోంది. ఒక పేద కుటుంబాన్ని టార్గెట్ చేసిన ధనిక వ్యక్తి చుట్టూ మూవీ తిరుగుతోంది. ఈ చిత్రంలో పొట్టేల్ ప్రధాన పాత్ర పోషిస్తుండడంతో టైటిల్ పొట్టేల్ అని పెట్టినట్లు క్లారిటీ వచ్చేసింది.

అయితే ఈ మూవీ టీజర్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. అన్ని వర్గాల ఆడియన్స్ ను అలరిస్తోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని నెటిజన్లు చెబుతున్నారు. తెలంగాణ నేపథ్యంలో సాగుతున్న ఈ మూవీ.. టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో రా అండ్ రస్టిక్ మూవీగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదని అంటున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంది పొట్టేల్ టీజర్.

ఇక సందీప్ రెడ్డి వంగా కామెంట్స్ కూడా సినిమాపై అంచనాలు పెంచాయి. పొట్టేల్ టీజర్ చూసినప్పుడు.. రాసుకున్న స్టోరీకి అనుగుణంగా మూవీ అద్భుతంగా తీసినట్లు అనిపించిందని తెలిపారు. మూవీని మొదటి రోజు చూసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు. పొట్టేల్ చిత్రం అందరికీ నచ్చుతుందని పేర్కొన్నారు. సినిమా పెద్ద హిట్ అవ్వడం పక్కా అని జోస్యం చెప్పారు. దీంతో సందీప్ కామెంట్స్ ఆడియన్స్ లో మంచి హైప్ క్రియేట్ చేశాయి.

ఎన్ ఐ ఏ ఎంటర్టైన్మెంట్స్, ప్రగ్యా సన్నిధి క్రియేషన్స్ బ్యానర్లపై నిశాంత్ రెడ్డి, సురేష్ కుమార్ నిర్మాణంలో పొట్టేల్ మూవీ రూపొందుతోంది. అజయ్, ప్రియాంక శర్మ, తనస్వి చౌదరి, నోయల్ సేన్, ఛత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఓ వైపు షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ, మరోవైపు సినిమాలు చేస్తున్న సాహిత్.. ఈ మూవీతో హిట్ కొట్టడం కన్ఫామ్ అనేలా టీజర్ ఉంది. మరి ఈ సినిమా థియేటర్లలో ఎప్పుడు వస్తుందో చూడాలి.