Begin typing your search above and press return to search.

ప్రభాస్ ఆగమనం.. ఇక సిద్ధమవ్వండి సలార్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ సినిమా కోసం అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

By:  Tupaki Desk   |   8 Nov 2023 5:44 AM GMT
ప్రభాస్ ఆగమనం.. ఇక సిద్ధమవ్వండి సలార్
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ సినిమా కోసం అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని ఎంతో నమ్మకంతో ఉన్నారు. అయితే చిత్రం యూనిట్ అప్డేట్స్ విషయంలో మాత్రం చాలా నెమ్మదిగా అడుగులు వేస్తూ ఉండడం పై విమర్శలు గట్టిగానే వస్తున్నాయి.

అయితే సినిమా డిసెంబర్ 22న విడుదలవుతుండగా ప్రమోషన్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. ఇక ప్రభాస్ వచ్చిన తర్వాతనే రెగ్యులర్ ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలి అని చిత్ర యూనిట్ ఆలోచించింది. ప్రభాస్ మోకాలుకు సర్జరీ ఉండడంతో కొన్ని వారాల క్రితం యూరప్ వెళ్లాల్సి వచ్చింది. అక్కడే రెస్టు తీసుకున్న ప్రభాస్ మొత్తానికి ఇప్పుడు ఇండియాలో అడుగు పెట్టాడు.

ప్రభాస్ వచ్చాడు అని తెలియగానే ఇంటర్నెట్ ప్రపంచంలో అప్పుడే హడావిడి మొదలైపోయింది. ఇక సలార్ సందడికి సిద్ధం కావాలి అని జోరుగా ప్రచారాలు మొదలు పెట్టేసారు. సలార్ సినిమా ప్రమోషన్స్ కోసం అయితే ప్రభాస్ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో తిరగబోతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ముంబైలో కూడా ఒక ఈవెంట్ నిర్వహించాలని అనుకుంటున్నారు.

ఇక కటౌట్స్ విషయంలో అయితే గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ కు ఎక్కువగా నచ్చిన కటౌట్ ను ఢిల్లీ ముంబై నగరాలలో ఎక్కువగా సెట్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ప్రభాస్ ప్రతి లాంగ్వేజ్ లో మీడియా సమావేశంలో పాల్గొనబోతున్నాడు. రాధేశ్యామ్ అప్పుడు కూడా ప్రభాస్ ప్రమోషన్స్ విషయంలో ఎంతగా హార్డ్ వర్క్ చేసాడో ప్రత్యేకంగా చెప్పడం అవసరం లేదు.

ఇక ఆది పురుష్ ప్రమోషన్లో మాత్రం ఎక్కువగా పాల్గొనలేదు. ఇప్పుడు సలార్ పై అంచనాలను మరింత పెంచేలా ప్రభాస్ టీం సిద్ధమవుతోంది. ఇక సలార్ సినిమా రెండు భాగాలుగా రాబోతున్న విషయం తెలిసిందే. ఇందులో మెయిన్ హీరోయిన్ గా శృతిహాసన్ నటించగా జగపతిబాబు పృథ్వీరాజ్ పవర్ఫుల్ విలన్స్ గా కనిపించబోతున్నారు. ప్రభాస్ కూడా రెండు విభిన్నమైన షేడ్స్ లో కనిపించబోతున్నట్లు సమాచారం.