సలార్ దెబ్బేస్తుందా.. తప్పుకుంటుందా?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సలార్ మూవీ డిసెంబర్ 22న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 6 Nov 2023 9:06 AM GMTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సలార్ మూవీ డిసెంబర్ 22న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా సిద్ధమవుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ నుంచి ఇప్పటి వరకు ఒక్క సక్సెస్ కూడా రాలేదు. అయితే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతూ ఉండటం వలన ఎక్స్ పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి.
ఇప్పటికే సెప్టెంబర్ లో అనుకున్న రిలీజ్ డేట్ డిసెంబర్ కి వెళ్ళింది. ఈ సారి మాత్రం ఎట్టి పరిస్థితిలో వాయిదా వేసే అవకాశం లేదని ఓ వైపు టాక్ వినిపిస్తోంది. మరో వైపు డిసెంబర్ 21న షారుఖ్ ఖాన్ డుంకీ మూవీ రిలీజ్ కాబోతోంది. రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతూ ఉండటం వలన ప్రభాస్ కి గట్టి పోటీ ఎదురుకాబోతోంది. ఈ ఏడాది షారుఖ్ ఖాన్ నుంచి రెండు సూపర్ హిట్స్ వచ్చాయి.
పఠాన్, జవాన్ రెండు సినిమాలు కూడా వెయ్యి కోట్లకి పైగా కలెక్ట్ చేశాయి. దీంతో డుంకీ సినిమాపై కూడా చాలా ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రస్తుతం షారుఖ్ ఉన్న స్పీడ్ చూసుకుంటే డుంకీతో హిట్ కొట్టే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. ఈ కారణంగా సలార్ సినిమాని వచ్చే ఏడాదికి వాయిదా వేస్తారనే ప్రచారం తెరపైకి వచ్చింది. షారుఖ్ ఖాన్ తో పోటీ పడితే సలార్ పై ఎఫక్ట్ పడుతుందని భావించి నిర్మాతలు ఆలోచనలు పడ్డారనే టాక్ ఫిలిం నగర్ సర్కిల్ లో నడుస్తోంది.
అయితే డిసెంబర్ 22 రిలీజ్ విషయంలో వెనక్కి తగ్గే ఛాన్స్ లేదనే మాట కూడా మరో వర్గం నుంచి వినిపిస్తోంది. ప్రశాంత్ నీల్ మాత్రం సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారని, అందుకే ఆ డేట్ కి ఫిక్స్ అయ్యారని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇప్పటికే సినిమా బిజినెస్ కూడా కంప్లీట్ కావడంతో వాయిదా వేస్తే ఇబ్బంది అవుతుందని భావిస్తున్నట్లుగా టాక్.
ఏది ఏమైనా సలార్ మూవీ రిలీజ్ విషయంలో ఇప్పటికి ఆడియన్స్ లో కన్ఫ్యూజన్ అయితే ఉంది. కాని డార్లింగ్ అభిమానులు మాత్రం డిసెంబర్ 22న రావడం ఖాయం అని నమ్ముతున్నారు. సినిమా నుంచి ఇప్పటి వరకు ఒక్క టీజర్ తప్ప బలంగా జనాల్లోకి తీసుకెళ్ళే ఒక్క అప్డేట్ రాలేదు. అందుకే చిత్ర యూనిట్ అఫీషియల్ గా రిలీజ్ డేట్ ని మరోసారి కన్ఫర్మ్ చేసేంత వరకు వెయిట్ చేయాల్సిందే.