Begin typing your search above and press return to search.

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమయ్యేది అప్పుడే

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్నారు.

By:  Tupaki Desk   |   25 Nov 2023 3:43 AM GMT
ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమయ్యేది అప్పుడే
X

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 22న ప్రభాస్ నటించిన సలార్ మూవీ ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకుని ఉన్నారు.

దీని తర్వాత వచ్చే ఏడాది నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్కి మూవీ రిలీజ్ కానుంది. అలాగే మారుతి దర్శకత్వంలో చేస్తున్న రాజా డీలక్స్ కూడా నెక్స్ట్ ఏడాదిలోనే వచ్చే ఛాన్స్ ఉంది. ఈ రెండింటి తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ స్పిరిట్ సినిమాని చేయనున్నారు. ఈ సినిమాకి సంబందించిన ఎనౌన్స్ మెంట్ ఏడాది క్రితమే వచ్చింది

టి సిరీస్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించడానికి సిద్ధమైంది. స్పిరిట్ కి సంబంధించిన అప్డేట్స్ ఇప్పటివరకు సందీప్ రెడ్డి నుంచి రాలేదు. ప్రస్తుతం ఆయన రణబీర్ కపూర్ హీరోగా యానిమల్ అనే సినిమాని పాన్ ఇండియా స్థాయిలో చేసే పనిలో ఉన్నారు.. డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ థియేటర్స్ లోకి రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం జోరుగా జరుగుతున్నాయి.

ఇందులో భాగంగా స్పిరిట్ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ కూడా ఇచ్చారు. యానిమల్ రిలీజ్ అయిన తర్వాత వెంటనే స్పిరిట్ మూవీ స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తానని క్లారిటీ ఇచ్చేశారు. ప్రస్తుతం తన ఫోకస్ అంతా యానిమల్ పైన ఉందని చెప్పారు. స్పిరిట్ సినిమాలో ఆడియన్స్ తన నుంచి ఎక్స్పెక్ట్ చేసి అన్ని అంశాలు ఉంటాయని చెప్పుకొచ్చారు. యానిమల్ ట్రైలర్ చూసిన తర్వాత డార్లింగ్ ప్రభాస్ అభిమానులు అలాంటి పవర్ ఫుల్ క్యారెక్టర్ లో తమ హీరోని చూసుకోవాలని ఆశపడుతున్నారు.

స్పిరిట్ మూవీలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. మరి అతని పాత్రని సందీప్ రెడ్డి వంగా ఏ విధంగా డిజైన్ చేశారనేది చూడాలి. ఇప్పటి వరకు ప్రభాస్ కెరియర్ లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించలేదు. ఈ కారణంగా స్పిరిట్ పైన మరింతగా అంచనాలు క్రియేట్ అయ్యి ఉన్నాయి. వచ్చే ఏడాదిలోనే ఈ సినిమాకి సంబందించిన అన్ని విషయాలు బయటకొచ్చే అవకాశం ఉంది.