ప్రభాస్ - శ్రీను మధ్య దూరం.. అసలు విషయం ఇదే!
ప్రభాస్ కి సన్నిహితులు చాలా మంది ఉంటారు. వారిలో కొందరు జనాలకు తెలియదు.. జనాలకు తెలిసిన వారిలో శ్రీను ముందు ఉంటాడు.
By: Tupaki Desk | 17 Nov 2023 6:11 AM GMTహీరోల స్థాయిని బట్టి వారి చుట్టూ ఎప్పుడూ కూడా అయిదు నుంచి పది మంది ఉంటారు. ఆ హీరో యొక్క డేట్లు మొదలుకుని వ్యక్తిగత మరియు వృత్తిగత విషయాలను, పనులను చూసుకుంటూ ఉంటారు. హీరోలను నమ్ముకుని ఉన్న వారికి కచ్చితంగా హీరో స్థాయి పెరుగుతున్నా కొద్ది ఏదో ఒక అవకాశం దక్కుతూనే ఉంటుంది అనడంలో సందేహం లేదు.
ప్రభాస్ కి సన్నిహితులు చాలా మంది ఉంటారు. వారిలో కొందరు జనాలకు తెలియదు.. జనాలకు తెలిసిన వారిలో శ్రీను ముందు ఉంటాడు. ఏకంగా తన పేరును ప్రభాస్ శ్రీను అని మార్చుకుని మరీ ఇండస్ట్రీలో ఆయన సుపరిచితుడు అయ్యాడు. కెరీర్ ఆరంభంలో ప్రభాస్ వెంటే ఎక్కువగా కనిపించే శ్రీను ఇప్పుడు కనిపించడం లేదు.
సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ప్రభాస్ శ్రీను గత కొంత కాలంగా ప్రభాస్ కి దూరంగా ఉంటున్నాడు, ఏదో గొడవ కారణంగా శ్రీను ను ప్రభాస్ దూరం పెట్టాడు. అందుకే తన సినిమాల్లో కూడా ఆఫర్లు ఇవ్వడం లేదు అంటూ మీడియా సర్కిల్స్ మరియు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరిగింది.. ఇంకా జరుగుతూనే ఉంది.
ఎట్టకేలకు ప్రభాస్ కి దూరం అవ్వడం పై శ్రీను స్పందించాడు. ఔను ప్రభాస్ కి ఈ మధ్య కాలంలో దూరంగానే ఉంటున్నాను. ఒకప్పుడు ఉన్నంతగా ఇప్పుడు ప్రభాస్ కి దగ్గరగా ఉండటం లేదు అన్నట్లుగా ప్రభాస్ శ్రీను క్లారిటీ ఇచ్చాడు. అది ఎందుకు అనే విషయమై కూడా ఆయన తాజా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు.
ప్రభాస్ తో యాక్టింగ్ స్కూల్ అప్పటి నుంచి కూడా నాకు పరిచయం. ఆ పరిచయం చాలా బలమైన స్నేహంగా మారింది. ఏం ఆశించకుండా మా ఇద్దరి స్నేహం ఏర్పడింది, అలాగే సాగింది. అయితే నేను ఒకానొక సమయంలో సినిమాలతో బిజీ అవ్వడంతో ప్రభాస్ అప్పగించిన పనులు పూర్తి చేయడంలో ఆలస్యం అవుతుంది.
ప్రభాస్ తో ఉంటే సినిమా లు ఎక్కువ చేయలేం. సినిమాలు ఎక్కువగా చేస్తే ప్రభాస్ పక్కన ఉండటం కష్టం అవుతుంది. ఆ విషయాన్ని గుర్తించిన ప్రభాస్ యాక్టింగ్ పై ఎక్కువ దృష్టి పెట్టు. అక్కడ ఎప్పుడైతే ఆఫర్లు తగ్గుతాయో తప్పకుండా నా వద్దకు వచ్చేద్దువు అన్నాడు. అందుకే ఈ మధ్య కాలంలో ప్రభాస్ కి దూరంగా ఉన్నాను.
మా ఇద్దరి మధ్య స్నేహం చెడి పోలేదు, మా ఇద్దరి మధ్య దూరం పెరగలేదు. నేను ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ప్రభాస్ ని కలుస్తాను, ఆయనతో మాట్లాడుతాను, ఇప్పటికి ప్రభాస్ వద్ద నాకు ఆ చనువు ఉందని ప్రభాస్ శ్రీను పేర్కొన్నాడు