Begin typing your search above and press return to search.

చరణ్‌ పై బుల్లితెర స్టార్‌ ఇంట్రస్టింగ్ కామెంట్స్‌

టాలీవుడ్‌ లో ఉన్న స్టార్‌ హీరోల్లో ఎక్కువ శాతం మంది స్టార్ కిడ్స్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

By:  Tupaki Desk   |   21 Sept 2024 6:00 AM IST
చరణ్‌ పై బుల్లితెర స్టార్‌ ఇంట్రస్టింగ్ కామెంట్స్‌
X

టాలీవుడ్‌ లో ఉన్న స్టార్‌ హీరోల్లో ఎక్కువ శాతం మంది స్టార్ కిడ్స్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగాస్టార్‌ వంటి పెద్ద స్టార్‌ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన చరణ్‌ ఈజీగా స్టార్‌ అవ్వలేదు. తాను చిరంజీవి తనయుడిని అనే భావం ఎక్కడ చూపించకుండా చాలా కష్టపడే వ్యక్తి చరణ్‌. చిరంజీవి వంటి స్టార్‌ వారసత్వంను నిలపడం అంత ఈజీ కాదు. కానీ చరణ్ మాత్రం తండ్రి వారసత్వం ను నిలబెట్టేందుకు సినిమా ల్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కష్టపడుతూనే ఉంటాడు. తాజాగా బుల్లి తెర స్టార్‌ ప్రభాకర్‌ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చరణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ప్రభాకర్‌ తనయుడు చంద్రహాస్‌ ను హీరోగా పరిచయం చేయబోతున్నారు. రామ్ నగర్ బన్నీ సినిమాతో చంద్రహాస్‌ ప్రేక్షకులకు పరిచయం అవ్వబోతున్నాడు. ఈ సినిమాను స్వయంగా ప్రభాకర్‌ నిర్మించాడు. సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రభాకర్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చరణ్‌ గురించి మాట్లాడాడు. చరణ్ ను గొప్ప వారసుడిగా ప్రభాకర్‌ ప్రశంసించాడు. చిరంజీవి గారి వారసత్వంను నిలిపిన రామ్‌ చరణ్‌ ఎంతో మంది ఫ్యాన్స్ మనసును గెలుచుకున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు.

ప్రభాకర్‌ ఇంకా మాట్లాడుతూ... చిరంజీవి సినిమాలను మానేసి రాజకీయాల్లోకి వెళ్లిన సమయంలో చాలా మందితో పాటు నేను బాధ పడ్డాను. ఆ సమయంలో కనీసం అన్నం కూడా తినాలి అనిపించలేదు. అలాంటి సమయంలో మెగాస్టార్‌ తనయుడిగా, చిరంజీవి నట వారసత్వంను అందిపుచ్చుకుని రామ్‌ చరణ్‌ ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. మగధీర సినిమా తో తనపై ఉన్న విమర్శలు అన్నింటికి చరణ్ సమాధానం చెప్పాడు. తండ్రి ఇమేజ్ కారణంగా వచ్చాడు అంటూ అప్పటి వరకు చెప్పిన వారు అంతా కూడా నోరు మూసుకున్నారు. చరణ్‌ కి ప్రతిభ ఉంది కనుక ఇండస్ట్రీలో ఉన్నాడని అంతా అనడం మొదలైంది.

చిరంజీవి కొడుకు అనేది ఒత్తిడి తో కూడుకున్న బాధ్యత. అలాంటి బాధ్యతను రామ్‌ చరణ్ హ్యాండిల్‌ చేసిన విధానం చాలా బాగుంటుంది. తాను కొత్తగా గొప్ప పేరును తండ్రికి తెచ్చి పెట్టాల్సిన అవసరం లేదు, ఉన్న పేరును పాడు చేయకుండా పని చేస్తే చాలు. కానీ చరణ్‌ చాలా కష్టపడ్డాడు. అందరి మాదిరిగా పబ్ లు, క్లబ్‌ లు అంటూ తిరగకుండా సినిమాల్లో కష్టపడి కొత్తగా వచ్చే నటీ నటులకు ఆదర్శంగా నిలిచాడు. చరణ్‌ గురించి ప్రభాకర్‌ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను మెగా ఫ్యాన్స్‌ సోషల్ మీడియాలో తెగ షేర్‌ చేస్తున్నారు