ప్రభాస్ Bడే: జపాన్‌లో ముందే కూసిన కోయిల
ఆ తరవాత సాహోతో 500 కోట్లు, సలార్ తో 800కోట్లు, `కల్కి 2989 ఏడి`తో 1200 కోట్లు వసూల్ చేసిన భారతీయ నటుడు మన ప్రభాస్.
By: Tupaki Desk | 20 Oct 2024 7:45 AM GMTతాను నటించే ఒక్కో సినిమాతో అంతకంతకు బాక్సాఫీస్ వద్ద స్టామినా పెంచుకుంటూ, భారతదేశంలోనే ఎదురేలేని స్టార్‌గా ఎదిగాడు డార్లింగ్ ప్రభాస్. టాలీవుడ్‌లో ఒక సాధారణ హీరోగా మొదలై, ఇప్పుడు అసాధారణమైన పాన్ ఇండియా స్టార్‌డమ్ ని అందుకున్నాడు. ప్రపంచ దేశాల్లో అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ని తెచ్చుకున్నాడు. బాహుబలి ఫ్రాంఛైజీ చిత్రాలతో 2200 కోట్లు తెచ్చిన స్టార్ అతడు. ఆ తరవాత సాహోతో 500 కోట్లు, సలార్ తో 800కోట్లు, `కల్కి 2989 ఏడి`తో 1200 కోట్లు వసూల్ చేసిన భారతీయ నటుడు మన ప్రభాస్.
అయితే అతడికి ఈ స్టామినా ఎలా వచ్చింది? అంటే.. కేవలం భారతదేశంలోనే కాకుండా విదేశాల నుంచి అతడి సినిమాలు సాధిస్తున్న వసూళ్లతోనే.. ఇది సాధ్యమైంది. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్, జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి చోట్ల ప్రభాస్ కి భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక వీటన్నిటిలో జపాన్ అభిమానులు చాలా ప్రత్యేకం. అక్కడ ప్రభాస్ కి గుడులు కట్టేందుకు వీళ్లు వెనకాడడం లేదు. ప్రభాస్ ని నేరుగా కలిసేందుకు హైదరాబాద్ లోని అతడి ఇంటికే వచ్చేశారు జపనీ అభిమానులు. ఈ రచ్చంతా గతంలో మీడియాలో హైలైట్ అయింది.
ప్రభాస్ నటించిన `కల్కి 2898 AD` చిత్రం 2025లోను జపాన్‌లో విడుదల కానుండగా ఆ సినిమా కోసం జపనీ ఫ్యాన్స్ ఎంతో ఎగ్జయిటింగ్ గా వేచి చూస్తున్నారు. అంతకుముందే ప్రభాస్ 45వ పుట్టినరోజుకు ముందు అతడికి టోక్యోలో జపనీస్ అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. అక్టోబర్ 23న పుట్టినరోజు కాగా, మూడు రోజుల ముందే సెలబ్రేషన్ లో ఉన్న టోక్యోకు చెందిన అభిమాని శుభాకాంక్షలు చెబుతున్న ఓ వీడియో వైరల్ గా మారింది.
2015లో S.S. రాజమౌళి ఎపిక్ యాక్షన్ డ్రామా `బాహుబలి: ది బిగినింగ్`లో ప్రభాస్ శివుడు/మహేంద్ర బాహుబలి, అమరేంద్ర బాహుబలిగా ద్విపాత్రాభినయం చేశాడు. ఈ చిత్రం రూ. 180 కోట్ల ($28 మిలియన్లు) బడ్జెట్‌తో తెరకెక్కి విడుదలైంది. అప్పటికి ఇది అత్యంత ఖరీదైన భారతీయ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. రికార్డు స్థాయిలో బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 600 కోట్లు (US$72 మిలియన్లు) వసూలు చేసింది. ఇది అత్యధిక వసూళ్లు చేసిన తెలుగు చిత్రంగా, ఆ సమయంలో అత్యధిక వసూళ్లు చేసిన రెండవ భారతీయ చిత్రంగా నిలిచింది. ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాలలో ఇది ఒకటి. ఇది జాతీయ అంతర్జాతీయ ప్రశంసలు అందుకుంది. పాన్-ఇండియన్ ఫిల్మ్స్ అనే కొత్త ఉద్యమాన్ని ప్రారంభించింది.
బాహుబలి-1 తర్వాత బాహుబలి -2 విడుదలై దాదాపు 1600 కోట్లు వసూలు చేయడం ఒక సంచలనం. ఫ్రాంఛైజీ రెండు చిత్రాలు కలిపి 2200 కోట్లు వసూలు చేసి అంతకుముందు ఉన్న అన్ని రికార్డులను తుడిచి పెట్టేసింది. బాహుబలి ఫ్రాంఛైజీతోనే ప్రభాస్ కి విదేశాల్లో భారీ ఫాలోయింగ్ పెరిగింది. ముఖ్యంగా జపనీ అభిమానులు తమ సాంస్కృతిక వారసత్వంతో బాహుబలి కనెక్షన్ కి రిలేట్ అయ్యారు. వెంటనే ప్రభాస్‌కి అభిమానులుగా మారారు. ప్రభాస్ తదుపరి `ది రాజా సాబ్`లో కనిపించనున్నాడు. అతడు అతిధి పాత్రలో నటించిన `కన్నప్ప` విడుదల కావాల్సి ఉంది.