ప్రభాస్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
ఇదిలా ఉంటే పాన్ ఇండియా రేంజ్ లో నెంబర్ వన్ హీరోగా ఉన్న ప్రభాస్ గురించి పూర్తిగా ఎవరికి తెలియదు.
By: Tupaki Desk | 23 Oct 2024 4:55 AM GMTఅభిమానులు అందరూ డార్లింగ్ గా పిలుచుకునే నటుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ‘బాహుబలి’ సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ప్రభాస్ కి దేశ వ్యాప్తంగా విశేషమైన అభిమానగణం దొరికింది. ఆ మూవీ తర్వాత ‘సాహో’, ‘రాధేశ్యామ్’, ‘ఆదిపురుష్’ సినిమాలతో డార్లింగ్ ప్రభాస్ వరుసగా మూడు ఫ్లాప్ లు సొంతం చేసుకున్నాడు. అయిన కూడా పాన్ ఇండియా రేంజ్ లో అతని జోరు తగ్గలేదు. ఫ్లాప్ అయిన కూడా ఈ సినిమాలు భారీ కలెక్షన్స్ సాధించాయి.
‘సలార్’ మూవీతో ప్రభాస్ సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా అతని మాస్ ఎలివేషన్, యాక్షన్ సీక్వెన్స్ కారణంగా కమర్షియల్ సక్సెస్ అందుకుంది. మూవీ ఏకంగా 700 కోట్లు కలెక్ట్ చేసింది. ‘కల్కి 2898ఏడీ’ మూవీతో రెండో సారి 1000 కోట్ల క్లబ్ లో ప్రభాస్ చేరాడు. ఈ సినిమా తర్వాత అతని మార్కెట్ రేంజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఐదు సినిమాలున్నాయి. వాటిలో కచ్చితంగా మూడు సినిమాలు 1000 కోట్ల క్లబ్ లో చేరుతాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉంటే పాన్ ఇండియా రేంజ్ లో నెంబర్ వన్ హీరోగా ఉన్న ప్రభాస్ గురించి పూర్తిగా ఎవరికి తెలియదు. అతని పూర్తి పేరు వెంకట సూర్యనారాయణ ప్రభాస్ రాజు. అయన భీమవరం డిఎన్ఆర్ కాలేజీలోనే ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు. వైజాగ్ లో సత్యానంద్ మాస్టర్ దగ్గర యాక్టింగ్ లో శిక్షణ తీసుకున్నారు. ప్రభాస్ 20 ఏళ్ళ వయస్సుకే ఈశ్వర్ మూవీతో హీరోగా అరంగేట్రం చేశారు.
ప్రభాస్ కి బద్ధకం ఎక్కువ అని ఆయనతో స్నేహం ఉన్నవాళ్లు చెప్పేమాట. అలాగే మంచి భోజన ప్రియుడు. బటర్ చికెన్, బిర్యాని బాగా ఇష్టంగా తింటారు. షూటింగ్ జరిగినపుడు తన తోటి నటీనటులకి ప్రభాస్ ఇంటి నుంచి భోజనం తెప్పిస్తాడు. యాక్టర్ కాకుండా ఉండే ఫుడ్ బిజినెస్ లోకి వెళ్ళేవాడినని గతంలో ప్రభాస్ చెప్పారు. ఆతిథ్యం ఇవ్వడం అంటే ప్రభాస్ కి చాలా ఇష్టం అంట. అలాగే ప్రభాస్ కి హాలీవుడ్ కి ఇష్టమైన యాక్టర్ రాబర్ట్ డినిరో.
ఇష్టమైన దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ. అతని మేకింగ్ స్టైల్ ప్రభాస్ ఇష్టపడతాడు. అతను చేసిన ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’, ‘3 ఇడియట్స్’ సినిమాలను 20 సార్లు చూసాడు. బాహుబలికి ముందు ప్రభాస్ హిందీలో ‘యాక్షన్-జాక్సన్’ అనే మూవీలో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చాడు. ప్రభాస్ కి యూరప్ అంటే ఇష్టం. షూటింగ్స్ లేకుండా అక్కడికి వెళ్ళిపోయి కొద్ది రోజులు సేదతీరుతాడు. మేడమ్ టుస్సాడ్ మ్యూజియం మైనపు విగ్రహం ఘనత అందుకున్న మొట్టమొదటి తెలుగు హీరో ప్రభాస్ కావడం విశేషం. ఇలా చాలా ఇంటరెస్టింగ్ అంశాలు ప్రభాస్ గురించి ఉన్నాయి. ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరు ప్రభాస్ కి విషెస్ చెబుతున్నారు.