Begin typing your search above and press return to search.

ప్రభాస్ సడన్ బ్రేక్.. ఎందుకంటే..

ఇటలీలో కొద్ది రోజులు రెస్ట్ తీసుకొని తిరిగి వచ్చిన తర్వాత సంక్రాంతి ఫెస్టివల్ కోసం సొంతూరు వెళ్లే అవకాశం ఉంది.

By:  Tupaki Desk   |   31 Dec 2024 8:30 AM GMT
ప్రభాస్ సడన్ బ్రేక్.. ఎందుకంటే..
X

డార్లింగ్ ప్రభాస్ లైనప్ లో ఏకంగా ఐదు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకదానిని మించి ఒకటి ఉంటాయనే సంగతి తెలిసిందే. మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్స్ నుంచి ఈ సినిమాలన్నీ రాబోతున్నాయి. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ప్రభాస్ 'ది రాజాసాబ్' మూవీ చేస్తున్నాడు. రీసెంట్ గా ఈ మూవీ షూటింగ్ సమయంలో ప్రభాస్ కి గాయం అయ్యింది. అప్పటి నుంచి ఆయన కాస్త నెమ్మదిగానే షూటింగ్స్ లో పాల్గొంటున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి మరికొన్ని రోజులు ప్రభాస్ బ్రేక్ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. నిజానికి 'ది రాజాసాబ్' షూటింగ్ ని ప్రభాస్ డిసెంబర్ లో కంప్లీట్ చేసి హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ఫౌజీ' కోసం జాయిన్ అవ్వాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ప్రభాస్ స్మాల్ బ్రేక్ తీసుకొని ఇటలీ వెళ్ళారంట. న్యూ ఇయర్ అక్కడే సెలబ్రేట్ చేసుకోబోతున్నట్లు టాక్.

ఇటలీలో కొద్ది రోజులు రెస్ట్ తీసుకొని తిరిగి వచ్చిన తర్వాత సంక్రాంతి ఫెస్టివల్ కోసం సొంతూరు వెళ్లే అవకాశం ఉంది. కుటుంబంతో కలిసి సంక్రాంతి సెలవులు పూర్తిగా అక్కడే గడపనున్నారంట. ఆ పై షూటింగ్ జాయిన్ అవుతారని తెలుస్తోంది. అంటే మేగ్జిమమ్ జనవరి నెల ఆఖరులో లేదంటే ఫిబ్రవరి మొదటి వారం నుంచి ప్రభాస్ మరల సినిమా షూటింగ్ లకి అందుబాటులో ఉండొచ్చు.

'ది రాజాసాబ్' షూటింగ్ పూర్తి చేయడంతో పాటు, హను దర్శకత్వంలో సినిమా చిత్రీకరణలో కూడా ప్రభాస్ పాల్గొనే ఛాన్స్ ఉందని సమాచారం. ఇదిలా ఉంటే ఇప్పటికే హను రాఘవపూడి 'ఫౌజీ' మూవీ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఇమాన్వి ఇస్మాయిల్ మీద కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.

ఇక సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేయాల్సిన 'స్పిరిట్' సినిమా సెట్ లో 2025 సమ్మర్ తర్వాత ప్రభాస్ జాయిన్ అయ్యే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. ఈ లోపు సందీప్ రెడ్డి కూడా ప్రభాస్ అవసరం లేని సన్నివేశాలు షూట్ చేయబోతున్నారని టాక్ నడుస్తోంది. జనవరి ఫెస్టివల్ తర్వాత 'స్పిరిట్' మూవీ షూటింగ్ గురించి పూర్తిగా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

అలాగే 'కల్కి 2898ఏడీ పార్ట్ 2' మూవీ షూటింగ్ కూడా 2025లోనే నాగ్ అశ్విన్ స్టార్ట్ చేసే అవకాశం ఉందని అనుకుంటున్నారు. అయితే ఏడాది ఆఖరులో సెట్స్ పైకి వెళ్లొచ్చనే టాక్ వినిపిస్తోంది. దీని తర్వాత ప్రశాంత్ నీల్ దర్సకత్వంలో 'సలార్ 2' మూవీ స్టార్ట్ అవుతుంది. 2026లో ఆ సినిమా స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.