Begin typing your search above and press return to search.

బాలీవుడ్ యాక్ష‌న్ చిత్రంలో ప్ర‌భాస్ అతిథిగా

బాహుబ‌లితో ప్ర‌భాస్ హవా పాన్ ఇండియాలో మొద‌లైంది.

By:  Tupaki Desk   |   3 Sep 2024 10:47 AM GMT
బాలీవుడ్ యాక్ష‌న్ చిత్రంలో ప్ర‌భాస్ అతిథిగా
X

బాహుబ‌లితో ప్ర‌భాస్ హవా పాన్ ఇండియాలో మొద‌లైంది. అప్ప‌టి నుంచి అత‌డు వెనుదిరిగి చూసిందే లేదు. జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా హిందీ ఆడియెన్ నుంచి ఆద‌ర‌ణ అందుకుంటున్నాడు. సౌత్ మార్కెట్ తో పాటు, ఉత్త‌రాది మార్కెట్ పైనా ప్ర‌భాస్ గ్రిప్ అన్నివేళ‌లా హాట్ టాపిక్. ఇటీవ‌ల క‌ల్కి 2989 అసాధార‌ణ విజ‌యం అత‌డి స్థాయిని మ‌రింత పెంచింది.

తాజా స‌మాచారం మేర‌కు.. డార్లింగ్ ప్ర‌భాస్ బాలీవుడ్ లో తెర‌కెక్కుతున్న అత్యంత భారీ యాక్ష‌న్ చిత్రంలో ఎంట్రీ ఇస్తున్నాడ‌ని తెలిసింది. తాజా మీడియా క‌థ‌నాల‌ ప్రకారం.. ప్రతిష్టాత్మక బాలీవుడ్ యాక్షన్ చిత్రం `సింగం ఎగైన్`లో అతిథి పాత్రలో ప్ర‌భాస్ న‌టించ‌నున్నార‌ని తెలిసింది. రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో టైటిల్ రోల్‌లో అజయ్ దేవగన్ న‌టిస్తున్నారు. ప్రభాస్ అతిధి పాత్ర గురించి అధికారికంగా క‌న్ఫామ్ చేయ‌క‌పోయినా కానీ.. దర్శకుడు రోహిత్ శెట్టి ఒక సీక్రెట్ పోస్ట్ ని షేర్ చేయ‌గా అది క‌చ్ఛితంగా ప్ర‌భాస్ అయి ఉంటాడ‌ని అంతా ఊహిస్తున్నారు. అస‌లు ఆ న‌టుడు ఎవ‌రు? అన్న‌ది వెల్లడించకుండా రోహిత్ శెట్టి సౌత్ హీరో అతిథి పాత్ర గురించి హింట్ ఇచ్చాడు. ఈ స్పెష‌ల్ స్టార్ లేకుండా మా చిత్రం అసంపూర్తిగా ఉంటుందని ఆ పోస్ట్ లో పేర్కొన్నారు. తన చిత్రాలలో ప్రభాస్‌తో రెగ్యుల‌ర్ గా క‌నిపించే స్కార్పియో బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతున్న వీడియోను కూడా షేర్ చేశాడు.

స్కార్పియో ఫోటోల‌కు `కల్కి` (ప్ర‌భాస్) సిగ్నేచర్ థీమ్ సాంగ్‌ను ఉపయోగించ‌డంలో అభిమాన‌లు చాలా స్పీడ్ గా ఉన్నారు. ఒక‌వేళ సింగం 3లో ప్ర‌భాస్ అతిథి పాత్ర‌ నిజ‌మైతే..అత‌డి కెరీర్ లో ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా మారుతుంది. పాన్-ఇండియన్ స్టార్‌గా అతడి క్రేజ్ ని ఇది మ‌రింత పెంచుతుంది. తమిళనాడులో `సింగం` ఫ్రాంచైజీకి విపరీతమైన ఆదరణ ఉన్నందున అక్క‌డ‌ అతిథి పాత్రలో కోలీవుడ్ సూపర్ స్టార్ సూర్య న‌టించే అవ‌కాశం ఉంటుంద‌ని భావిస్తున్నారు.

సింగం ఎగైన్ .. ఈ ఫ్రాంచైజీలో మూడవ సినిమా. ఇందులో అజయ్ దేవగన్ `నిర్భయ` పోలీసు అధికారిగా నటిస్తున్నారు. అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్, టైగర్ ష్రాఫ్, కరీనా కపూర్, దీపికా పదుకొనే త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ఆగ‌స్టులో రావాల్సి ఉన్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం, VFX వర్క్ కారణంగా ఈ సంవత్సరం దీపావళికి వాయిదా ప‌డింది. ఇప్పుడు ప్రభాస్ సింగం 3లో న‌టిస్తున్నాడ‌న్న వార్త‌లతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.